మ్యాగీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు…

రెడీమేడ్ ఫుడ్… మ్యాగీ నూడుల్స్ విషయంలో తమ వైఖరిలో మార్పులేదని ఫుడ్ సేఫ్టీ అధారిటీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తేల్చిచెప్పింది. చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన వంటకంగా దేశమంతా ప్రసిద్ధి…

రెడీమేడ్ ఫుడ్… మ్యాగీ నూడుల్స్ విషయంలో తమ వైఖరిలో మార్పులేదని ఫుడ్ సేఫ్టీ అధారిటీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తేల్చిచెప్పింది. చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన వంటకంగా దేశమంతా ప్రసిద్ధి చెందిన మ్యాగీ నూడుల్స్‌పై ఉత్తరప్రదేశ్‌లో మొదలైన వివాదం దేశమంతా విస్తరించి పలు రాష్ట్రాల్లో మ్యాగీ బ్యాన్ అయిన విషయం తెలిసిందే. 

దీంతో నెస్లే కంపెనీ సదరు మ్యాగీ నూడుల్స్ రకాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది. ఈ నేపధ్యంలో తాజాగా మ్యాగీలో తామెటువంటి హానికారక పదార్ధాలు చూడలేదని గోవాలో నిర్వహించిన ఒక పరీక్ష ఫలితం వెల్లడించింది. దీంతో పాటే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కూడా మ్యాగీ వినియోగం వల్ల ఆరోగ్యానికి నష్టమేం లేదని ప్రకటించిందని కూడా వదంతులు వచ్చాయి. అయితే దీన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ ఖండించింది. 

తమ పాత నిర్ణయంపై గోవా పరీక్షల ప్రభావం ఎంత మాత్రం లేదంది. మరోవైపు గోవా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం తాము ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబ్‌లో  శాంపిల్ పరీక్షలు నిర్వహించగా, మ్యాగీ నూడుల్స్ భారత దేశ ఆహార భధ్రతా నియమాలు, నిర్ణీత ప్రమాణాలకు లోబడే ఉన్నట్టు తేలిందని చెబుతోంది. దీనిపై ఇంకా ఎటువంటి స్పందనా వ్యక్తం చేయని నెస్లే ఇండియా ప్రతినిధులు తాము అధికారులతో సంప్రదింపులు, మ్యాగీ నూడుల్స్‌ను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అంటున్నారు.