పెళ్ళి లేటయితే అలాంటి తేడాలే వస్తాయి మరి

అహనా పెళ్ళియంట.. ఓహనా పెళ్ళియంట.. అని ఊరికే వార్తల్లో నానకుండా వెంటనే పెళ్ళి చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది వుండదు. పెళ్ళి ఆలస్యం అయితే హీరోయిన్‌ త్రిషకు వచ్చిన కష్టాలే వస్తాయి. చాన్నాళ్ళు హీరోయిన్‌గా వుండి,…

అహనా పెళ్ళియంట.. ఓహనా పెళ్ళియంట.. అని ఊరికే వార్తల్లో నానకుండా వెంటనే పెళ్ళి చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది వుండదు. పెళ్ళి ఆలస్యం అయితే హీరోయిన్‌ త్రిషకు వచ్చిన కష్టాలే వస్తాయి. చాన్నాళ్ళు హీరోయిన్‌గా వుండి, పెళ్ళీడు ఎప్పుడో దాటిపోయినా ఇప్పుడు ఒకింటి ఇల్లాలవ్వాలని అనుకుంటోంది. పెళ్ళి కొడుకుని కూడా వెతుక్కుంది. 

అన్నీ సవ్యంగానే వున్నా, పెళ్ళి డేటు లేటు అవడంతో ఒకరి లోపాలు ఒకరికి అర్థం అయిపోతున్నాడట. పెళ్ళి కొడుకు క్యారెక్టర్‌ అంత మంచిది కాదనీ, ఫొటోలతో సహా త్రిషకు ఎవరో సెగ పెట్టారట. దాంతో పెళ్ళి పెటాకులయిపోయిందని వార్తలొస్తున్నాయి. అయితే త్రిషను సముదాయించే పనిలో వున్నారట చుట్టాలు. 

‘నువ్వు తాగి రోడ్డు మీద అల్లరి చేసినప్పుడు పోలీసులొచ్చిన సంగతి ఆ కుర్రాడికి తెలియదనుకోకు. అందరికీ లోపాలుంటాయి. సర్దుకుపోవాలి..’ అని నచ్చజెబుతున్నారట. త్రిష మనసు మార్చుకుంటుందో, పెళ్ళి కొడుకునే మార్చేస్తుందో ఆగి చూడాల్సిందే.