అంజలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సీతమ్మ వాకిట్లో సీత కాదు..ఇప్పుడు.. మగాళ్లంటే మంట..పక్కా పురష ద్వేషి..ఏం చేస్తాం..అంతా కోన వెంకట్ మహిమ. మధ్యలో ఆయనేం చేసాడు? అన్న డౌట్ వచ్చింది..వచ్చే వుంటుంది.
అంజలి కోసం అలాంటి క్యారెక్టర్ తయారుచేసాడు. శంకరాభరణంలో గీతాంజలి ఓ పక్కా బందిపోటు..ప్లస్ పురుషద్వేషిణి కూడా. దాంతో ఆమె మాట, చేత అంటా మహా రఫ్ గా వుంటాయట.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈ మాట, చేత, ఆమె గెటప్ అంతా కలిసి..కాస్త సెక్సీ, క్రేజీ లుక్ వచ్చిందట. దాంతో, తనకు డిఫరెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేసారు..కోనకు మెనీ మెనీ థాంక్స్ అంటోంది అంజలి. సినిమా విడుదలయితే తప్ప, ఆమె మాటలు ఏ రేంజ్ లో నిజాలో తెలియదు,