Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సోషల్ మీడియాకు దూరంగా నవతరం

సోషల్ మీడియాకు దూరంగా నవతరం

ప్రస్తుతం జనాల జీవితాల్లో ఓ భాగమైపోయింది సోషల్ మీడియా. పొద్దున్న లేచిన వెంటనే వాట్సాప్ మెసేజీలు, ఫేస్ బుక్ స్టేటస్ లు చూసుకోవడం కామన్ అయిపోయింది. అయితే రాబోయే రోజుల్లో మాత్రం యువత దీనికి దూరంగా ఉండబోతోందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ మార్కెట్ బేస్డ్ రీసెర్చ్ తేల్చింది. 

21ఏళ్లకు దగ్గరవుతున్న యవకులు సోషల్ మీడియాకు దూరంగా జరుగుతున్నట్టు ఈ సర్వే తేల్చింది. 18నుంచి 24ఏళ్ల మధ్య వయసున్న యూత్ లో (ఆడ, మగ కలిపి) 50శాతం మంది సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు.

ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వ్యక్తుల్లో 34శాతం మంది ఇప్పటికే తమ మొబైల్ ఫోన్ల నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ తో పాటు డేటింగ్ యాప్ టిండర్ ఎకౌంట్ ను కూడా డిలీట్ చేశారట. ఇక డిసెంబర్ నుంచి చూసుకుంటే శ్నాప్ చాట్ లో కూడా పురోగతి లేదు.

సోషల్ మీడియా వల్ల చాలా టైం వృధా అవుతోందని 41శాతం యువత అభిప్రాయపడుతోంది. పైగా మొబైల్ లో సోషల్ మీడియా యాప్స్ ఉంటే వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటోందని వీళ్లు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి 18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులు కేవలం బ్రాండ్ ప్రొఫైల్స్ చెక్ చేయడానికి, ఆన్ లైన్ షాపింగ్ కు మాత్రమే సోషల్ మీడియాను పరిమితం చేశారు. ఇన్నాళ్లూ ఏ ఏజ్ గ్రూప్ ను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా వేదికలు పుట్టుకొచ్చాయో, ఇప్పుడు అదే ఏజ్ గ్రూప్ దానికి దూరమవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?