Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అట్లాంటా నగరంలో రాయలసీమ వనభోజనాలు

అట్లాంటా నగరంలో రాయలసీమ వనభోజనాలు

జూన్ 19న జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరంలో రాయలసీమ వనభోజనాల కార్యక్రమం విజయవంతమయ్యింది , బుఫోర్డ్ డ్యాం పార్కులో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు సుమారు 650 మంది హాజరై సిసలైన రాయలసీమ రుచులను ఆస్వాదించారు. 

వనభోజనాలలో ఉదయం టిఫిన్: హుగ్గాని, మిరపకాయ బజ్జి , పొంగలి  మధ్యాహ్నం భోజనానికి: రాగిసంగటి , అలసంద వడలు, సియ్యల పులుసు (Goat Curry), కోడి పులుసు (chicken curry), గ్రిల్ల్డ్ చికెన్ (Grilled Chicken), శనిక్కాయ ఊరిబిండి (Peanut/Groundnut  Chutney), ఉర్లగడ్డ తాళింపు (Potato Fry), తిరవాత అన్నం (Pulaav Rice), చిత్రాన్నం (Lemon Rice), నూనె వంకాయ (Stuffed Eggplant Curry), శెనగబ్యాళ్ల పాయసంతో కూడిన మెనూను వడ్డించడం జరిగింది. అతిధులంతా  వంటకాలన్నింటిని ఆస్వాదించి ప్రశంసించటం జరిగింది. భోజనాల తరువాత పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందచేయడం జరిగింది. 

సాయంత్రం సమయానికి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాయలసీమ వారిచే నిర్వహించబడుతున్నా తెలుగు వారందరు కలిసి చేసుకొనే కార్యక్రమమని రాయలసీమ ఆచార వ్యవహారాలను భావితరాలకు అందిస్తూ తెలుగు వారందరికీ రాయలసీమను పరిచయం చెయ్యటమే పరమావధిగా జరుపుతున్న కార్యక్రమమని మనవి చేసుకున్నారు, పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ రాయలసీమ పండుగ వాతావరణాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని కోరటం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల నుండి ఈ మధ్యే కొడుకు దగ్గరికి వచ్చిన పెద్దాయన వంగల రెడ్డి గారు మాట్లాడుతూ సిద్ధేశ్వరం అలుగు కోసం ప్రజాసంఘాలు గత నెల చేప్పట్టిన శంకుస్థాపన కార్యక్రమం గురించి వివరించారు ప్రవాస రాయలసీమ వాదులు ఇందులో ఏదో విధంగా భాగస్వాములు కావలసిందిగా కోరటం జరిగింది. రాయలసీమ పై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం జరిగింది ఇందులో భాగంగా రాయలసీమ వైభవాన్ని , విభజన తరువాత రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలను ఒక పవర్పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం జరిగింది.

వనభోజనాల కార్యక్రమం జరిగినంతసేపు అతిధులు చాలా ఆహ్లాదంగా గడిపారు , ఆప్యాయంగా పలకరించుకోవటం రాయలసీమ యాసలో మాట్లాడుకోవటం చూస్తే మొత్తం ఒక తిరుణాల వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. అతిధులు  అధిక సంఖ్యలో రావటంతో వాహనాల పార్కింగ్ కొంచెం సమస్యగా మారింది  నిర్వాహకులు రెండు మూడు వాహనాలలో వీలైనంతవరకు అతిధులను వేదికకు చేర్చారు , ఈ సమస్యవల్ల ఎవరైనా వెనుదిరిగి వెళ్ళివుంటే వారికి నిర్వాహకుల తరపున క్షమాపణలు, వచ్చే ఏడు ఇంకా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని కూడా తెలియజేసారు. ఈ సారి పిల్లలు చాలా పనుల్లో సహాయపడి అందరి మెప్పు పొందారు. మొత్తం మీద రాయలసీమ ఔన్నత్యం అస్తిత్వం తెలియజేసే ప్రధాన లక్ష్యంతో మూడేళ్ళుగా చేస్తున్న ఈ కార్యక్రమం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విజవంతం కావటంపట్ల నిర్వాహకులు RAYALA ATLANTA GROUP వారు సంతోషం తెలియజేసారు 

జై రాయలసీమ ... జై జై రాయలసీమ 

Click Here For Photo Album

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?