ఆహారం కోసం కాల్చేశారు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా దిగ్గజ దేశాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. అమెరికాలోనూ ఆకలి కేకలు మిన్నంటుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Advertisement కరోనా కారణంగా సుదీర్ఘ లాక్ డౌన్ ప్రకటించడంతో…

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా దిగ్గజ దేశాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి. అమెరికాలోనూ ఆకలి కేకలు మిన్నంటుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కరోనా కారణంగా సుదీర్ఘ లాక్ డౌన్ ప్రకటించడంతో అనేక దేశాల్లో ప్రజలకు ఉపాధి కరువైంది. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. చాలా పరిశ్రమలు దివాలా తీశాయి. ఆర్ధిక మాంద్యం కమ్ముకుంది. ఏరోజుకారోజు సంపాదించుకుంటూ రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో ఉన్న ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.

ఇలాంటి ప్రజలు పూర్తిగా ప్రభుత్వాల సహాయం మీదనే ఆధారపడ్డారు. ఆఫ్రికా దేశాల్లో లాక్ డౌన్ కారణంగా అనేక దారుణాలు జరుగుతున్నాయి. నైజీరియాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కంటే వివిధ రకాలుగా సాగుతున్న కాల్పుల్లో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

నైజీరియాలో ఈ మధ్యనే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ భద్రతా దళాలు 18 మందిని కాల్చి చంపాయి. వీరు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లమీదికి రావడంతో భద్రతా దళాలు కాల్చేశాయి. తాజాగా మరో కాల్పుల ఘటన జరిగింది. ఈ పని చేసింది భద్రతా దళాలు కాదు. లాక్ డౌన్ కారణంగా దోపిడీ దొంగలుగా మారిన కొందరు ప్రజలు. ఇందుకు కారణం ఉపాధి లేకపోవడమే.

ఉపాధి లేనప్పుడు సహజంగానే ఆహారం దొరకదు కదా. దీంతో వీరు ఆహారం కోసం దొంగలుగా మారారు.నైజీరియాలోని కట్ సినా రాష్ట్రంలో నిరుపేదలకు ప్రభుత్వం ఆహార పదార్థాలను, ఇతరత్రా సహాయాలను అందిస్తోంది. దీంతో కొందరు సాయుధ దొంగలు గ్రామాలపై దాడులు చేసి, 47 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేసి ఆహార పదార్థాలను, ఇతర సహాయాలను (వస్తువులు మొదలైనవి )ఎత్తుకెళ్లిపోయారు.

300 మందికి పైగా సాయుధులు గ్రామాలపై దాడులు చేశారు. పోలీసు బలగాలు అడవుల్లో వారి కోసం గాలిస్తున్నాయి. నైజీరియాలో ఇలాంటి కాల్పుల ఘటనలు, కిడ్నాపులు, దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. 

రోజా స్పెషల్ 'చికెన్ పికిల్

తెలంగాణాలో మే 7 వరకు చాలా కఠినంగా లాక్ డౌన్