5 వేల మందిని ఇంటర్వ్యూ చేసిన ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’

‘మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ముందే… మీరే ఇంటర్వ్యూ చేయించుకోండి’ అనే వినూత్న స్లోగన్‌తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్’ సంస్థ. చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు… నేరుగా పేరొందిన ఐటీ కంపెనీల…

‘మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ముందే… మీరే ఇంటర్వ్యూ చేయించుకోండి’ అనే వినూత్న స్లోగన్‌తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్’ సంస్థ. చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు… నేరుగా పేరొందిన ఐటీ కంపెనీల ఇంటర్వ్యూ బోర్డు సభ్యులచేతే మాక్ ఇంటర్వ్యూలు చేయించటం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ మాక్ ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఆ తరవాత అసలు ఇంటర్వ్యూలు ఈజీగా చేసెయ్యొచ్చు. 

అసలు ఇంటర్వ్యూలు చేసే బోర్డు సభ్యులు, అలాంటి స్థాయి ఉన్నవారే ఈ మాక్ ఇంటర్వ్యూలు చేస్తారు కనక… తప్పొప్పులుంటే దిద్దుకుని సిద్ధం కావటం కూడా ఈజీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’కు క్లయింట్లుగా చేరాయి. తమకు కావాల్సిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పంపించాల్సిందిగా కోరుతున్నాయి. 
 
 ఇంజినీరింగ్ కాలేజీల నుంచే…

ఐటీ సంస్థలు తమకు కావాల్సిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పంపించాల్సిందిగా ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’ను కోరటం ఒకెత్తయితే… ఇంజినీరింగ్ కాలేజీలు కూడా తమ వద్ద చదువుతున్న విద్యార్థుల్లో 6, 7వ సెమిస్టర్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి… వారిలో లోటుపాట్లను విశ్లేషించి చెప్పాల్సిందిగా ‘టెస్ట్ మై’ని కోరుతున్నాయి. ఇలా ఇంజినీరింగ్ కాలేజీల అభ్యర్థన మేరకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తున్న ‘టెస్ట్ మై’ సంస్థ ఒడిస్సాలోని కొన్ని కాలేజీలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు కాలేజీల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించింది. 

ఇప్పటికే 5 వేల మందికి పైగా విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి… వారి బలాలు, బలహీనతలపై సవివరమైన విశ్లేషణ నివేదికలు తయారు చేసింది. ఆ విద్యార్థుల్లో బాగా తెలివైన వారెవరు? అప్పటికప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించినా ఉద్యోగాలకు సెలక్ట్ కాగలిగే సామర్థ్యం ఎవరెవరికి ఉంది? ఎవరెవరు ఏఏ సబ్జెక్టుల్లో బాగున్నారు? దేన్లో బలహీనంగా ఉన్నారు? కాస్త కష్టపడి ప్రిపేరైతే ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం ఎందరికి ఉంది? 

ఎంత కష్టపడినా పెద్ద పెద్ద సంస్థల్లో ఇంటర్వ్యూలకు పనికొచ్చే పరిస్థితిలో లేనివారెందరు? ఇలా అన్ని రకాలుగా విశ్లేషించి ఆయా నివేదికలను కాలేజీ యాజమాన్యాలకు అందజేస్తోంది. వాటి ఆధారంగా యాజమాన్యాలు సదరు విద్యార్థులపై దృష్టి పెట్టడంతో పాటు వారిని క్యాంపస్ ఇంటర్వ్యూలకు పంపించటం కూడా జరుగుతోంది. 

‘టెస్ట్ మై’ సేవల వల్ల తాము విద్యార్థులపై బాగా ఫోకస్ చేయగలిగామని, తమ కాలేజీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ కావటానికి ఈ మాక్ ఇంటర్వ్యూలు ఎంతగానో ఉపకరించాయని పలు కాలేజీ యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. భవిష్యత్తులో కూడా ‘టెస్ట్ మై’ సేవల్ని వినియోగించుకుంటామని అవి పేర్కొన్నాయి. ఇది చూసిన ఇతర కాలేజీల యాజమాన్యాలు కూడా ఇంటర్వ్యూల నిమిత్తం ‘టెస్ట్ మై’ని ఆహ్వానిస్తున్నాయి. 
 కంపెనీలకూ కలిసొస్తోంది…

మామూలుగా  అయితే కంపెనీలు ఒక అభ్యర్థిని ఎంపిక చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వటం, లేదంటే జాబ్ పోర్టల్స్ నుంచి రెజ్యుమెలు తీసుకుని వారిని పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించటం చేస్తాయి. ఒక అభ్యర్థిని ఎంపిక చేయడానికి కనీసం ఐదారుగురిని ఇంటర్వ్యూ చెయ్యటం తప్పనిసరి. కానీ ‘టెస్ట్ మై’ సేవల్ని ఉపయోగించుకుంటున్న కంపెనీలకైతే ఇలాంటి ఇబ్బంది ఉండదు. 

ఇంటర్వ్యూలు కూడా చేసి… అన్ని విధాలా పనికొస్తారనుకున్న ఒకరిద్దరు అభ్యర్థుల్ని మాత్రమే ‘టెస్ట్ మై’ పంపిస్తుంది. వారు ఆ ఉద్యోగానికి సరిపోతున్నారు కూడా. ‘టెస్ట్ మై’ సేవల్ని వినియోగించుకోవటం వల్ల తమకు బోలెడంత సమయం, ఖర్చు కలిసొస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇంకేం! విద్యార్థులు నేరుగా ‘టెస్ట్‌మై ఇంటర్వ్యూ.కామ్’ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 
 
 టెస్ట్ మై ఇంటర్వ్యూ గురించి…

ఇది థింక్ డిజిటల్ సర్వీసెస్‌కు చెందిన సంస్థ. చదువును, హెచ్‌ఆర్‌ను విడివిడిగా చూడలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్’ పేరిట వినూత్న సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది విద్యార్థులకు, కంపెనీలకు, ఇంజినీరింగ్ కాలేజీలకు అందరికీ ఉపయుక్తమైన సేవల్ని అందిస్తోంది.