సర్వమతాల సమానమే ..

గౌ ముఖ్యమంత్రివర్యులు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం … ఈ ఆశయాన్ని అమలు చేయడమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారి ధ్యేయం.…

గౌ ముఖ్యమంత్రివర్యులు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం … ఈ ఆశయాన్ని అమలు చేయడమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారి ధ్యేయం.

ఆంధ్ర సమాజంలో అన్ని మతాలతో పాటు అత్యధికులుగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను కూడా గెలుచుకోవడమే మన పార్టీ ప్రభుత్వ లక్ష్యం.

అందువల్లనే గౌరవ ముఖ్యమంత్రి..  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భా ల్లో సర్వ మతాల సమాధారమే నా లక్ష్యం అంటూ చెప్పారు .

గౌరవ ముఖ్యమంత్రి ఆశయం, సూచన మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి..  కొట్టు సత్యనారాయణ గారు ఈ ఐదున్నర నెలలు గా అనేక నిర్ణయాలు తీసుకున్నారు అందులో కొన్ని…

1. హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడం .

2. హిందూ సంస్కృతిని కాపాడడం వేదం చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడం వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం. 

3. దేవాలయాల్లో వేళ్ళునుకుని పోయిన అవినీతిని సాధ్యమైనంత మేరకు అంతమొందించి ఆ శాఖకు ఉన్న అపప్రదను తొలగించడం మరియు టిక్కెట్టులు అమ్మకంలో అవక తవకలు లేకుండా దేవుడికి అందరూ సమానమే..
అందులో భాగంగా ఆన్లైన్ విధానం ప్రవేశ పెట్టడం .

4. సాధారణ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా మెప్పును పొందడం.

5. దేవాలయాల భూములు ఇతర ఆస్తులను ఆక్రమణల చెర నుండి కాపాడడం.

6. దేవాలయాల ఆదాయాన్ని పెంచడం.

7. 10 సంవత్సరాల తర్వాత 21 మంది సభ్యులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు

8. రిలీజియస్ టూరిజంకు చర్యలు పర్యాటకశాఖ తో కలిపి టెంపుల్ టూరిజం అభివృద్ధి

9. 17 దేవాలయాల్లో మాస్టర్ ప్లాన్ తయారీకి అనుమతులు

10. దేవాదాయ శాఖలో ఐదు సంవత్సరాల కాల పరిమితి నిండిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి

11. దేవాలయాలలో అవినీతి నిర్మూలనకు భక్తులకు జవాబుదారీ తనంతో పాటుగా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే విధంగా దేవాలయాల ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది

12. ధూప దీప నైవేద్యాల కింద రాష్ట్రంలో అర్హత సాధించిన  2839 దేవాలయాలకు 5000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగింది

13. దేవాలయాల నుండి రావలసిన సిజిఎఫ్ ఫండ్ బకాయిలను వసూలు చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రతి మంగళవారం దేవాదాయ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించి దీర్ఘకాలికంగా పరిష్కారం గాని అనేక సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది

14. 2016 నుండి ఇప్పటివరకు దేవాలయాల్లో ఆడిట్ మొత్తాన్ని సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది

15. దేశంలోనే మొట్టమొదటిసారిగా దేవాలయాలలో ఎక్కడ అవినీతి ఉండకూడదనే లక్ష్యంతో కాంక్రెంట్ ఆడిట్ పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది

16. సిజిఎఫ్ ద్వారా 478 దేవాలయాలకు 234 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది

17. 14 దేవాలయాలలో 10.27 కోట్ల రూపాయలతో 14 పుష్కరణలను ఏర్పాటు చేయడం జరుగుతుంది

18. జియో టాకింగ్ పద్ధతి ద్వారా దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు

19. శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి అటవీశాఖ తో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి సమన్వయ సమావేశం ఏర్పాటు

20. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి డాక్టర్ పద్మ రిటైర్డ్ ఐఏఎస్ వారిని నియమించడం ద్వారా ఐదు వేలకు పైగా ఉన్నటువంటి దేవాదాయ శాఖ కేసులకు సత్వర పరిష్కార మార్గం లభించే విధంగా చర్యలు

21. పూర్తిస్థాయిలో  సిజిఎఫ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది

22. వాస్తు ప్రకారం శాస్త్రవేత్తంగా మాస్టర్ ప్లాన్ అనుసరించి దుర్గమ్మ ఆలయాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటుగా భక్తుల సౌకర్యార్ధం 16వేల నుండి 18వేల మంది క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

23. అన్నవరం టెంపుల్ లో వేదపాఠశాల ప్రారంభించడం జరిగింది. వేదం పాఠనం పూర్తి విద్యార్థులకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా ప్రణాళిక

24. ప్రసాద్ వితరణ స్కీంలో భాగంగా ద్వారకతిరుమల అభివృద్ధికి 80కోట్లు, కాణిపాకం అభివృద్దికి 50కోట్లు, శ్రీకాళహస్తి అభివృద్ది 80కోట్లు, పెనుగంచిప్రోలు దేవాలయానికి 50కోట్లు, రామతీర్థం 20కోట్లు, అన్నవరం 30కోట్లు, సింహాచలం 70కోట్ల రూపాయిలకు.. మొత్తం 380కోట్ల రూపాయిలకు విజ్ఞప్తి చేశారు

25. దేవాదాయశాఖ భూములను పరిరక్షించేందుకు సెక్షన్ 83,84లను అమెండ్ మెంట్ ను క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం ద్వారా గతంలో అక్రమణదారుడుకి ఉన్న వెసులుబాటుమార్గాలకు చెక్క్ పెట్టి దేవాదాయశాఖకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది

26. దేవాలయాలలో మరియు ఇతర అవినీతి నిర్మూలనకు విజిలెన్స్ సెల్ నియమించడం ద్వారా చర్యలు

27. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు అందించడం జరుగుతుంది.

28. పంచారామలలో ఒక్కటైనా ద్రాక్షరామం దేవాలయం అభివృద్దికి అర్కియాలజీ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరడంతో   ఒక కమిటీని పంపించేందుకు కేంద్రమంత్రి అనుమతి ఇవ్వడం జరిగింది

29. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రసాదం క్వాలిటీ పెంచే విధంగా చర్యలు

30. దసర ఉత్సవాలు అన్ లైన్ చేసి భక్తులకు సౌకర్యం కల్పించడం జరుగుతుంది.