Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్ ఆరా…ఆగ్రహం!

రామ్ చరణ్ ఆరా…ఆగ్రహం!

గాడ్ ఫాదర్ కు నైజాం ఏరియాలో థియేటర్లు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని వినవస్తున్న కథనాల గురించి హీరో రామ్ చరణ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. తను సినిమా చేస్తున్న నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లే ఇలా అడ్డం పడుతున్నారంటూ వార్తలు వినిపించడం పట్ల రామ్ చరణ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ను ఆరా తీసినట్లు బోగట్టా. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది అన్న విషయాలు అన్నీ రామ్ చరణ్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

నైజాంలో ముందుగా దిల్ రాజుకే పంపిణీకి ఇద్దాం అనుకున్నారు. కానీ ఓ మాంచి కొత్త పార్టీ వచ్చి మంచి రేటుకు నాన్ రిఫండ బుల్ అడ్వాన్స్ కు గాడ్ ఫాదర్ ను తీసుకుంది. తీసుకుంటున్నపుడే ఆ పార్టీకి నేరుగా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లేదు కనుక, దిల్ రాజు చేతిలో పెట్టమని నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఓ మాట చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలు చేసిన వారు తమకు ఆసియన్ సునీల్ తో సన్నిహిత బంధాలు వున్నాయని అక్కడ పెట్టారు.

దాంతో ఇప్పుడు థియేటర్ర సమస్య లేదు కానీ నైజాంలో కొన్ని కీలకమైన థియేటర్లు మాత్రం గాడ్ ఫాదర్ కు రావడం లేదని తెలుస్తోంది. డబ్బింగ్ సినిమా అయిన పిఎస్ 1 కు కీలకమైన సుదర్శన్ థియేటర్ ను కేటాయించేసారు. ఇక మిగిలింది దేవీ మల్టీ ప్లెక్స్. అది అయినా గాడ్ ఫాదర్ కు దొరుకుతుందో లేదో చూడాలి.

రామ్ చరణ్ ఇప్పుడు రంగంలోకి దిగారు కనుక, మరి అతనితో సినిమా నిర్మిస్తున్న దిల్ రాజు..శిరీష్ దిగి వచ్చి గాడ్ ఫాదర్ కు కోపరేట్ చేస్తారేమో కూడాలి. ఈ మేరకు దిల్ రాజు, శిరీష్ లతో ఆసియన్ సునీల్ డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా వుంటే రామ్ చరణ్ కు కోపం వచ్చిందని తెలియడంతో సాయత్రం పొద్దు పోయాక జరిగిన సమావేశంలో సమస్యలపై  పరిష్కారానికి డిస్కషన్ల సాగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుదర్శన్ థియేటర్ ను గాడ్ ఫాదర్ కు ఇవ్వడానికి, పిఎస్ 1 సినిమాను దేవీ కి మార్చడానికి ఒప్పిందం కుదిరినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?