వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా మంత్రులుగా అయిన వారి పదవీకాలం అయిదు నెలలు పూర్తి అయింది. అలాగే మొదటి నుంచి కంటిన్యూ అవుతున్న వారు అయితే మూడేళ్ళ పై దాటింది. ఎమ్మెల్యేలదీ అదే కధ. ఇన్నేళ్ళలో ఎవరు ఎంత పెర్ఫార్మ్ చేశారు అన్నది జగన్ మాస్టార్ మార్కులేసి మరీ చెప్పబోతున్నారు. మరి గ్రేడింగులు ఇస్తారా ఇస్తే ఎవరు ఎక్కువలో ఉన్నారు, ఎవరు వెనక బడ్డారు ఇవన్నీ ఆసక్తికరమైన చర్చలే.
ఈ నెల 28న తాడేపల్లి గడపలో గడపగడపకూ కార్యక్రమం మీద వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. జగన్ అధ్యక్షతన జరిగే ఈ వర్క్ షాప్ లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరే ప్రధానంగా చర్చకు రానుంది. ఎమ్మెల్యేలలో డేంజర్ జోన్ లో ఎవరున్నారు. సేఫ్ జోన్ లోకి ఎవరు వచ్చారు అన్నది కూడా ఈ వర్క్ షాప్ ద్వారా చెబుతారని అంటునారు. ఇక పలువురు ఎమ్మెల్యేలకు గతసారి వర్క్ షాప్ లో చేసిన హెచ్చరికల మేరకు ఎంత వరకూ మెరుగుపరచుకున్నారు, ఇంకా గడప దాటని వారు ఎవరు అన్న వివరాలు కూడా విప్పి చెబుతారు అనే అంటున్నారు.
మొత్తం పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్లు ఈ వర్క్ షాప్ కి హాజరవుతారని అంటున్నారు. ఎప్పటికపుడు వైసీపీ చేయిస్తున్న సర్వేల ఫలితాలను కూడా ముఖ్యమంత్రి పార్టీ వారితో పంచుకుంటారని అంటున్నారు. బాగా పనిచేసిన వారు ఒకే, అలాగే దారిలో పడ్డ వారికీ ఫరవాలేదు, కానీ మేము ఇలాగే ఉంటామన్న వారికి అయితే క్లాస్ తప్పకుండా తీసుకుంటారనే అంటున్నారు.
మొత్తానికి వర్క్ షాప్ ఈసారి కొంత హాట్ హాట్ గానే సాగనుంది అంటున్నారు. ఇక ఈసారి వర్క్ షాప్ కొందరు మంత్రులకు కూడా కలవరం కలిగించే విధంగా సాగనుంది అంటున్నారు. మంత్రులు సరిగ్గా పనిచేయకపోతే మార్చేస్తాను అని జగన్ ఈ మధ్యనే ప్రకటన చేసినట్లుగా ప్రచారం జరిగింది.
దాంతో నవంబర్ లో మరోసారి విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో మంత్రులలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారని కూడా వర్క్ షాప్ ద్వారా ఒక కీలకమైన హింట్ వచ్చే చాన్స్ ఉంది అంటున్నారు. ఏది ఏమైనా జగన్ నిర్వహించే ఈ వర్క్ షాప్ మీద ఏపీ రాజకీయం అంతా ఆసక్తిగా గమనిస్తోంది అని అంటున్నారు.