అన్నా!
నేను నీ అభిమానిని. నాది మీ అమ్మగారి కులమూ కాదు, మీ నాన్నగారి కులమూ కాదు. కులాన్ని బట్టి అభిమానించే అభిమానిని కాను నేను.
నాకు నీ డ్యాన్సంటే ప్రాణం, నీ డయలాగ్ డెలివరీ అంటే ఇష్టం, నీ కామెడీ టైమింగ్ అంటే అభిమానం, ఓవరాల్ గా నువ్వు నటనలో ఏ రసం పిండినా అతి ఉండదు, అతకనట్టు ఉండదు. పోలుస్తున్నానని అనుకోవద్దుకానీ నీలాగ అన్ని విషయల్లోనూ టాప్ అనిపించున్న హీరోలు నీ నందమూరి వంశంలో కూడా లేరు.
వై.ఎస్.ఆర్ ని, ఎన్.టి.ఆర్ ని సమానంగా గౌరవిస్తూ పెట్టిన నీ ట్వీట్ కొంతమంది కులగజ్జిగాళ్లకి, పార్టీపిచ్చోళ్లకి నచ్చలేదు. వాళ్ళేదో వాగుతున్నారు. అయినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఆవగింజైనా లేదు.
ఎందుకో చెప్తాను.
చిన్నప్పటి నుంచి నీకూ, మీ అమ్మగారికి నందమూరి కుటుంబం ఇచ్చిన విలువేమిటో మరిచిపోయి, కాసేపు అన్నీ పక్కన పెట్టి 2009లో నువ్వు ఎగేసుకుని వాళ్ల పార్టీకి ప్రచారం చేసావు. ఆ సమయంలో నీకు యాక్సిడెంటయ్యింది. చావు తప్పి బయట పడ్డావు. అయినా నీ సేవలు తీసుకున్న ఎవ్వడూ నిన్ను సరైన పరామర్శైనా చెయ్యలేదు. వాడుకుని వదిలేసే వాళ్ల నైజాన్ని నువ్వు మనసారా రుచి చూసావు.
ఇక ఎలక్షన్స్ అయ్యాక ఆ పార్టీకి అప్పట్లో సీనులేక ఓడిపోయింది. వాళ్లు మాత్రం సైలెంటుగా ఓటమిని నీ ఖాతాలో వేసారు… అదేదో నువ్వు ప్రచారం చెయ్యకపోతే వాళ్లు గెలిచేసేవాళ్లన్నట్టుగా. అంత సిగ్గుమాలిన కృతజ్ఞత లేని జాతి అది.
అసలు పాలిటిక్స్ లో ప్రచారమనేది చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. కేవలం ప్రచారంతో ఎవ్వడూ గెలవడు. పార్టీకంటూ ఒక వేవ్ ఉండాలి. అది లేనప్పుడు దేవుడే దిగి వచ్చి ప్రచారం చేసినా ఓటర్స్ కనికరించరు. లోకేష్ బాబులాగ ట్రోలింగుల బారిన పడకుండా చాలా హుందాగా ప్రచారం చేసావు. అదే నీ ట్యాలెంటు. వాళ్ల కుటుంబంలో ఎవ్వడికీ ట్రోల్ అవ్వకుండా స్పీచ్ ఇచ్చే సీన్ లేదు కాబట్టే వాళ్లకి నువ్వు అవసరమయ్యావు. అంతే తప్ప నీ మీద ప్రేమ కాదని నీక్కూడా తెలుసు.
ఆ తర్వాత పార్టీ పిలిచినా జరిగిన దానికి భంగపడిన నువ్వు దూరంగా ఉంటూ వచ్చావు. అంతే..నీ సినిమాల్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చెయ్యడం మొదలుపెట్టి నీ కెరీర్ ని తొక్కేసే ప్రయత్నాలు చేసారు ఆ గ్యాంగ్. అయినా నీ ప్రతిభతో నువ్వు నిలబడ్డావు. సూర్యుడ్ని అరచేత్తో ఆపలేనట్టే నీ సక్సెస్సుని ఆ ముఠా ఏమీ చెయ్యలేకపోయింది.
ఎంత గూడుపుఠాణీలు చేసినా నువ్వు పాన్-ఇండియా స్టారైపోయావు. నీ కెరీర్ ఏదో ఒక కులం చేతిలోనో, ఒక పార్టీ చేతిలోనో ఉందని ఎవడన్నా భ్రమ చెందితే వాడికంటే భ్రమరావతిగాడు ఎవ్వడూ ఉండడు. నీకు అన్ని కులాల్లోనూ, అన్ని పార్టీల్లోనూ అభిమానులున్నారు. నువ్వు ఫ్యాన్స్ సపోర్ట్ కోసం ఆ పచ్చ బ్యాచ్ ని నమ్ముకోవాల్సిన అవసరం అస్సలు లేదు.పైగా వాళ్లని నమ్ముకుంటే నువ్వు ఒక వర్గానికే పరిమితమయ్యి కార్నరైపోతావు తప్ప ఫలితమేమీ ఉండదు.
అయినా పచ్చ గ్యాంగుకి ఒక ప్రశ్న వెయ్యాలి. నిజంగా వాళ్ల చేతుల్లో వాళ్ల కులపు హీరోల కెరీర్లుంటే మరి తారకరత్నని, కళ్యాణ్ రాం ని ఎందుకు టాప్ హీరోల్ని చెయ్యలేకపోయారు. ట్యాలెంటుండి, జనాభిమానం కలిసొస్తే ఎవ్వడన్నా టాప్ లోకి వెళ్తాడు. లేకపోతే ఒకేసారి తొమ్మిది సినిమాలు చేసినా తొంభై బ్యానర్లు కట్టినా ఎవ్వడూ పట్టించుకోడు.
కనుక అన్నా! నువ్వు ఎవ్వడ్నీ పట్టించుకోకు. అందర్నీ సమానంగా చూస్తూ, నీకు న్యాయమనే విధంగా విషయాల మీద ఇలాగే స్పందిస్తూ ముందుకెళ్లు. దయచేసి ఏ వర్గం వైపుకు మొగ్గకు. అన్నిటికీ అతీతంగా నిలబడి నెంబర్ వన్ గా ఎదిగేంత ట్యాలెంట్ నీకు దేవుడిచ్చాడు. ఆ దేవుడికి, నీ మనస్సాక్షికి జవాబుదారిగా ఉండంతే.
ఇవన్నీ నీకు తెలియవని కాదు. నువ్వు ఫాలో అవుతున్నదే నీకు చెప్పాను. కేవలం నీ అభిమానిగా నా మనసులో ఉన్నది చెప్పి ఇలాగే కంటిన్యూ అయిపోమని విన్నవించుకుంటున్నాను.
– పి. అశోక్ కుమార్