ఆండ్రాయిడ్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తున్నారా?

మాంఛి ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంది. అందులో పోర్న్ చూడాలని అనుకుంటే మాత్రం మీ ఫోన్ తో పాటు కీలకమైన డేటాను రిస్క్ లో పెట్టినట్టే. అవును.. ప్రపంచవ్యాప్తంగా 25శాతం మాల్ వేర్,…

మాంఛి ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంది. అందులో పోర్న్ చూడాలని అనుకుంటే మాత్రం మీ ఫోన్ తో పాటు కీలకమైన డేటాను రిస్క్ లో పెట్టినట్టే. అవును.. ప్రపంచవ్యాప్తంగా 25శాతం మాల్ వేర్, పోర్న్ సైట్స్ ద్వారానే వ్యాప్తి చెందుతోంది. సెక్యూరిటీ ఫీచర్లు తక్కువగా ఉండే ఆండ్రాయిడ్ ఫోన్లలో నీలిచిత్రాల వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే కొన్నాళ్లకు మీ డేటా పబ్లిక్ లోకి రావడం ఖాయం. లేదంటే మీ పాస్ వర్డ్స్ హ్యాక్ అవ్వడం గ్యారెంటీ.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆండ్రాయిడ్ ఫోన్లపై సర్వేచేసి ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు నిపుణులు. కంప్యూటర్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో పోర్న్ చూస్తే రిస్క్ చాలా ఎక్కువంటున్నారు. కీలకమైన పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డు నంబర్లు, ఇతర ముఖ్యమైన డేటాను పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఫోన్ కూడా లాక్ అయిపోతుంది.

మరీ ముఖ్యంగా లొకేషన్ ఎనేబుల్ చేసి పోర్న్ చూస్తే రిస్క్ ఇంకా ఎక్కువంటున్నారు ఎక్స్ పర్ట్ లు. ఒకవేళ ఆండ్రాయిడ్ లో పోర్న్ చూడాలనిపిస్తే బ్రౌజర్ లో ఇన్-కాగ్నిటో మోడ్ లోకి వెళ్లి చూడాలని సూచిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో పోర్న్ చూడాలనుకునేవాళ్ల కోసం కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఆండ్రాయిడ్ లో పోర్న్ చూడాలనుకుంటే ముందుగా లొకేషన్ సర్వీస్ ను డిజేబుల్ చేయాలట. తర్వాత ఇన్-కాగ్నిటో మోడ్ లో మాత్రమే చూడాలని సూచిస్తున్నారు. పోర్న్ చూసేటప్పుడు నాక్స్ (knox) లాంటి ఫీచర్లు ఉపయోగించాలని, బాగా పాపులర్ అయిన సైట్స్ మాత్రమే ఓపెన్ చేయాలని చెబుతున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా పోర్న్ చూసేటప్పుడు ఎలాంటి యాప్స్ ఇన్ స్టాల్స్ చేయొద్దని, ప్లే స్టోర్ అస్సలు ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్లే వైరస్ బారిన పడుతున్నాయని అంటున్నారు టెక్ నిపుణులు.