భాగమతి పక్కా హిట్ గురూ

భాగమతి హిట్ అన్నది నమ్మడానికి అందరూ సిద్దంగా లేరు ఎందుకో. ఫస్ట్ వీకెండ్ తరువాత జారిపోతుందిలే అనుకున్న జనాలు వున్నారు. టాలీవుడ్ లో ఇదో ఆనందం అంతే. అయితే భాగమతి మండే టెస్ట్ పాసయిపోవడమే…

భాగమతి హిట్ అన్నది నమ్మడానికి అందరూ సిద్దంగా లేరు ఎందుకో. ఫస్ట్ వీకెండ్ తరువాత జారిపోతుందిలే అనుకున్న జనాలు వున్నారు. టాలీవుడ్ లో ఇదో ఆనందం అంతే. అయితే భాగమతి మండే టెస్ట్ పాసయిపోవడమే కాదు, సాధారణంగా డల్ గా వుండే మంగళవారం టెస్ట్ కూడా పాసయిపోయింది. మంగళవారం మార్నింగ్ షో లే కాదు, మాట్నీలు కూడా మంచి కలెక్షన్లు అందుకున్నట్లు వార్తలు అందుతున్నాయి.

దీంతో యూనిట్ పిచ్చ హ్యాపీగా సక్సెస్ మీట్ కు రెడీ అయిపోయింది. భాగమతి టోటల్ గా ఫస్ట్ ఫైవ్ డేస్ కు ఏపి తెలంగాణ కలిపే 16కోట్ల వరకు షేర్ వచ్చేసింది. ఓవర్ సీస్ ఓకె. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వన్ మిలియన్ మార్క్ రికార్డు తెచ్చుకునేదారిలో వుంది. దాంతో యువికి అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయినట్లే. ఫస్ట్ వీక్ షేర్ అనుకున్నట్లే 20కోట్ల మేరకు వచ్చేస్తుందన్న ధీమా అయితే వచ్చేసింది.

పద్మావత్ పోటీ వుండడం వల్ల కానీ లేకపోతే భాగమతి ఇంకా మంచి ఫలితాలు నమోదు చేసి వుండేది. పద్మావత్ మన దగ్గర కూడా బి సెంటర్లలో కూడా బాగానే కలెక్షన్లు నమోదు చేయడం విశేషం.

భాగమతి నాలుగు రోజుల గ్రాస్ కలెక్షన్లు ఇలా వున్నాయి

నైజాం………………. 9.96.23.645
సీడెడ్………………. 2.71.07.753
ఉత్తరాంధ్ర…………… 2.76.57.472
ఈస్ట్………………… 1.32.52.177
వెస్ట్……………….. 1.11.90.308
కృష్ణ…………………. 1.92.88.695
గుంటూరు…………… 1.60.71.754
నెల్లూరు……………….. 79.56.208

ఆంధ్ర తెలంగాణ టోటల్…. 22.21.48.012

థాంక్స్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి