డబ్బింగ్ మొదలైంది.. రిలీజ్ ఎప్పుడో?

విశ్వరూపం-2 సినిమా రెడీగా ఉందంటూ దాదాపు 7-8 నెలలుగా చెబుతూ వస్తున్నాడు కమల్ హాసన్. అలా చెబుతున్న ప్రతిసారి ఓ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న సినిమా మొత్తం సిద్ధమైపోయిందని మరోసారి ప్రకటించాడు.…

విశ్వరూపం-2 సినిమా రెడీగా ఉందంటూ దాదాపు 7-8 నెలలుగా చెబుతూ వస్తున్నాడు కమల్ హాసన్. అలా చెబుతున్న ప్రతిసారి ఓ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న సినిమా మొత్తం సిద్ధమైపోయిందని మరోసారి ప్రకటించాడు. ఈసారి డబ్బింగ్ మొదలుపెట్టాడు. అంటే.. విశ్వరూపం-2 సినిమాకు సంబంధించి మొన్నటివరకు డబ్బింగ్ కూడా పూర్తవ్వలేదన్నమాట.

సినిమాను జనవరి 26న విడుదల చేస్తామని గతంలో ప్రకటించాడు కమల్ హాసన్. అప్పటికి 2షెడ్యూల్స్ పెండింగ్ లో ఉన్నాయి. డబ్బింగ్ కూడా పూర్తవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 30శాతం కూడా కాలేదు. అలాంటి టైమ్ లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. కానీ చెప్పిన టైమ్ కు రాలేకపోయాడు.

మరోవైపు ఈ సినిమా సౌండ్ మిక్సింగ్ పనులు హాలీవుడ్ లో చురుగ్గా సాగుతున్నాయి. చెన్నైలో టీజర్ కటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విశ్వరూపం-2సినిమాకు సంబంధించి మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నాడు.

ఇప్పటికైనా అన్ని పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే.. అది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన విషయం మాత్రమే. మిగతావన్నీ దాదాపు పెండింగ్ లోనే ఉన్నాయి.