అల్లుడి సినిమాకు మామ క్లాప్

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ ధేవ్ తొలి సినిమాకు క్లాప్ పడింది. ప్రముఖ నిర్మాణం సంస్థ వారాహి చలనచిత్ర పతాకంపై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించే ఈ సినిమాకు ఈరోజు లాంఛనంగా ముహూర్తం జరిగింది.…

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ ధేవ్ తొలి సినిమాకు క్లాప్ పడింది. ప్రముఖ నిర్మాణం సంస్థ వారాహి చలనచిత్ర పతాకంపై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించే ఈ సినిమాకు ఈరోజు లాంఛనంగా ముహూర్తం జరిగింది. మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా క్లాప్ కొట్టారు.

గతంలో జతకలిసే అనే చిన్న సినిమాను అందించిన రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మాళవిక నాయర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. తొలి షాట్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎమ్ఎమ్ కీరవాణి కెమేరా స్విచాన్ చేసారు.

అవసరాల శ్రీనివాస్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరు, ఎన్వీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు సెంధిల్ కుమార్ కెమేరా హ్యాండిల్ చేస్తారు. జ్యో అచ్యుతానంద, రంగస్థలం సినిమాకు పనిచేసిన రామకృష్ణ ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహారిస్తారు.

తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్య రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి