చికాగోలో చిరు జల్లులు, అయిన లెక్క చేయక అప్తుల చిరు స్టెప్స్ తో, చిరు జల్లులు చిన్నబోయేలా జరిగిన అప్త నార్త్ సెంట్రల్ రీజియన్ హేమలంబ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని ని నిజం చేసిన చికాగో అప్తులు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక 10 కుటంబాలతో మొదలై నేడు ఒక మహా వృక్షం గా తీర్చి దిద్దిన అప్త నార్త్ సెంట్రల్ రీజియన్ అప్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే! 350 పై చిలుకు అప్తులు ఉగాది ఉత్సవలుకు హాజరు కావడం చికాగో అప్త చరిత్రలో ఒక మైలు రాయి.
సాయం సంద్య సమయం 5 గంటలకు మొదలై రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆప్తుల అనందోత్సవాల మద్య జరిగిన ఉగాది ఉత్సవాలు కి చక్కటి వాఖ్యాణాలతో అద్యంతం తమ యాంకరింగ్ తో అలరించిన జ్యోతి నున్న, సునందా పాపోలు మరియు శ్రీ యర్రంశెట్టి గారుకి ప్రత్యేక అభినందనలు.
అర్.వి.పి వినయ్ వెలివెల గారి స్వాగతోపన్యాసంతో ఉగాది ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. విఘ్నాదిపతి విఘ్నేశ్వరుడిని ప్రాద్దిస్తూ దీపారాదన శ్రీనివాస్ చిమట (అప్త బోర్డ్ ఆఫ్ డైరక్టర్), మధు వుళ్ళి (అప్త వైస్ ప్రెసిడెంట్) మరియు లక్ష్మి వెలివెల (అప్త ఎన్.సి వుమెన్ డైరక్టర్) గారు చేసారు. సాహిరి వెలివల వినాయకుడిని స్తుతిస్తూ, వైష్ణవి చీడిపూడి మరియు మాన్యశ్రీ ముత్యల శ్రీరాముడిని కీర్తిస్తూ, మనస్విని తుమ్ము అన్నమాచార్య కీర్తనలతో అప్తులు ఇక్కడున్న సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు అని మరొక్కసారి నిరూపించారు.
జ్యోతి వంగర గారి ఆద్వర్యంలో చిన్నారులు జానపద నృత్యం ఆహుతలను అలరించారు. హంసికా తుమ్మూ గోపికమ్మ అనే పాట ఆలపిస్తూ, కుమారి రాగిణి మేరినీడి చిరంజీవి మెగా మెడ్లీ డాన్స్ కి సభాప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగి పోయింది.
ఈషా యెర్రంశెట్టి నాంచాక్ విన్యాసాలు, హవ్య సిరి వెలివల వేణుగానం, శ్రీ శనక్కాయల వారి వెస్టర్న్ డాన్స్ తో అప్తులను ఆకట్టుకొన్నారు. జయశ్రీ సోమిసెట్టి గారు కూర్చిన మెగా జూనియర్స్ డాన్స్, డాక్టర్ ఆదిత్య కీర్తీ రాయపురెడ్డి గారు ఆద్వర్యంలో రత్తాలు రత్తాలు పెర్ఫార్మెన్స్ డాన్స్ మరియు షర్మిత & నిషిత తోట పాటలు అప్తులను ఓలలాడించాయి. నేటి సమాజంలో మహిళ అత్మ రక్షణ కోసం మాస్టర్ యు మార్షల్ ఆర్ట్స్ తో చక్కగా విశిదీకరించారు.
శ్రీమతి సౌజన్య యర్రంశెట్టి రూపొందించిన అప్త చిన్నారుల ఫేషన్ షో ఆహుతులను అబ్బురపరిచింది. అప్త చికాగో వేదిక అప్తులనే కాక తమ రీజియన్లో ముఖ్యులను ఆహ్యానించడం కొత్త సాంప్రదాయనికి తెరతీయడం ఆహ్యానించదగ్గ పరిణామం.
నేపర్విల్లే మేయర్ పోర్టం జాన్ మరియు కాంగ్రేస్ మేన్ రాజాక్రిష్ణమూర్తి గారు ఆఫీస్ నుంచి లెస్లి ఆన్ రీసే ని ఆహ్యానించి సత్కరించారు. అర్.వి.పి వినయ్ వెలివెల గారు తన ప్రసంగంలో అప్త గురించి అప్త చేస్తున్న సేవల గురించి చక్కటి స్లైడ్స్ తో వివరించారు.
ఆప్తా గురించి క్లుప్తంగా ఆప్తా ఏ.వి మరియు ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం వీడియోస్ ప్రదర్శించి ఆప్తా ప్రగతిని వివరించారు. ఆప్తా మేత్ ఒలంపియాడ్ విజేతలకు ప్రొత్సాహబహుమతులు కూడా అందించి చిన్నారులలో ఉత్తేజం నింపారు.
అరుణ్ మచ్చా, బాలా బెవర, పవన్ ఆకుల, రవితేజా ముమ్మడి చేసిన ఫన్ బక్కెట్ కామిడీ, భారతి యర్రంశెట్టి గారు కూర్చిన బాలివుడ్ డాన్స్, రాజేష్ రాజనాల, వెంకట్ వీరా వెలివల మరియు శివ పాపోలు కామెడి స్కిట్, మెగా స్టార్ పవర్ స్టార్ అంటూ శివ మరియు వీర వెంకట్ టీం పెర్ఫార్మన్స్ అప్తులు ఆద్యంతం తిలకించి తమ ఉత్సాహాన్ని హర్షాతిరేకం చప్పట్లు ఈళలతో హాల్ మారుమ్రోగింది.
చివరిగా రఘు కుంచే గారు మాదురి క్రిష్ణ గారు పాడిన పాటలకు చిన్నరుల నుంచి పెద్ద వారు వరకు డాన్స్ ఫ్లోర్ మీద నృత్యాలతో సందడి సందడిగా జరిగింది. ఆంద్రా పిండి వంటలతో చక్కని విందు బోజనాలతో ప్రతి ఒక్క అప్తుడి కడుపార వడ్డించి అప్తుల మర్యాదలు రుచి చూపించిన చికాగో ఉగాది ఉత్సవాలు కనులకు వినోదం కడుపుకి విందు అందించారు.
అప్త నార్త్ సెంట్రల్ రీజియన్ హేమలంబ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకి మొదట నుండి వెన్నుదన్నుగా నిలిచిన యర్రంశెట్టి సోదరులు, వీర వెంకట వెలివెల, రమేష్ తుమ్మూ , వెంకటేశ్ తోట, సురేంద్ర ఇస్క, సురేష్ శనక్కాయల, అరుణ్ మచ్చా, బాలమురళి బెవెర, సత్య తోట, రాజేష్ రాజనాల, శివ పాపోలు, దుర్గా చీడిపుడి, చక్రి ముత్యాల, రఘురాం శంకు, రాం నరేష్ యనుమల, పవన్ ఆకుల, రవితేజ ముమ్మడి, శివ నందపునీడు, చైతు కందుల, నగేష్ దూలం, వెంకట్ బత్తిన, మురళి ముమ్మడి, మనోజ్ మంచాల, రమేష్ కుంచనపల్లి ఇలా ఎందరో తక్కువ సమయంలో చక్కటి ప్రణాళికలతో తమ సహాయ సహకారాలు అందించడం జరిగింది.
మగవారితో మేము ఏమన్న తక్కువ అంటూ అప్త వుమెన్ డైరక్టర్ లక్ష్మి వెలివెల గారు ఆద్యర్యంలో కవిత ఇస్క, సౌజన్య యర్రంశెట్టి, జయశ్రీ సొమిసెట్టి, భారతి యర్రంశెట్టి, స్వప్న తుమ్ము, వేణి శనక్కాయల, భాగ్య చీడిపుడి, సునీత తోట, నాగెశ్వరి తోట, లావణ్య మత్చ, పద్మ తోట, సౌజన్య వెలివెల, ప్రసన్న రాజనాల, సంతోష కుమారి బెవెర, పణిదీప్తి, శ్రావణి ముత్యాల, నికిత తిరుమలశెట్టి, డాక్టర్ కీర్తి రాయపురెడ్డి, శుద కుంచనపల్లి ఇలా ఎందరో అప్త ఆడపడుచులు వెన్నటే నిలవడమే కాకుండా, ప్రతి పనిలో చేదోడు వాదోడుగా తమ సహాయ సహకారాలు అందించడం అప్తకి శుభపరిణామం.
ప్రత్యేక దన్యవాదములు రిజిస్ట్రేషన్ టీం, ఫుడ్ టీం, స్వాగత టీం, డికరేషన్ టీం, కల్చరల్ టీం మరియు లాజిస్టిక్ టీంస్ కి ఆర్.వి.పి వినయ్ వెలివెల గారు తెలుపుకోవడం జరిగింది.
ఉగాది సంబరాలకు ఆర్ధిక సహాయం చేసిన లిబ్సిస్ ఇంకార్పొరేషన్, తాట్ వేవ్, రుచి రెస్టారెంట్, మూవి మేక్స్ దియేటర్, ప్రసన్న రాఘవ రియల్ ఎస్టేట్స్, షార్ప్ ఎడ్జ్ సొల్యూషన్స్, ఎవియస్ కన్సల్టంట్స్, ఆస్క్ ఇండియన్ కుజిన్, 7 హిల్స్ రీల్ ఎస్టేట్స్, సాహిరి ఏక్యురేట్ ఇంఫోటెక్, విజ్ టెక్, పెర్ఫెక్ట్ పొట్రాయిట్ ఫొటోగ్రఫి మరియు యాంగ్ ఇన్ అరోరా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ వారికి ప్రత్యేక దన్యవాదములు.
Photo Album: https://goo.gl/photos/2AMZsm79js8YFDo89