అర్నబ్‌.. మరో సంచలనం.. ‘వై’.?

అర్నబ్‌ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది. అంత గొంతేసుకుని, విరుచుకుపడిపోతుంటారీయన. రాజకీయ నాయకులే నయ్యం.. ఈయనతో పోల్చితే. ఆ స్థాయిలో ఆయన డిక్టేటర్‌లా వ్యవహరించేస్తుంటారు. సీనియర్‌ జర్నలిస్ట్‌, టైమ్స్‌ నౌ ఛానల్‌ ఎడిటర్‌ అర్నబ్‌…

అర్నబ్‌ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది. అంత గొంతేసుకుని, విరుచుకుపడిపోతుంటారీయన. రాజకీయ నాయకులే నయ్యం.. ఈయనతో పోల్చితే. ఆ స్థాయిలో ఆయన డిక్టేటర్‌లా వ్యవహరించేస్తుంటారు. సీనియర్‌ జర్నలిస్ట్‌, టైమ్స్‌ నౌ ఛానల్‌ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి ఇప్పుడు తాజాగా వార్తల్లోకెక్కారు. దేశమంతా ఇప్పుడు ఈయన గురించే మాట్లాడుకుంటోంది. కారణం, తీవ్రవాద సంస్థల నుంచి అర్నబ్‌కి బెదిరింపులు రావడం, ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రతనివ్వడమే. 

భద్రతా సిబ్బంది, భద్రతాధికారులు.. అబ్బో, అర్నబ్‌ గోస్వామి చుట్టూ ఇకపై పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయన్నమాట. అసలాయన ధైర్యం ఏంటి.? అని అంతా ముక్కున వేలేసుకునేలా, ఆయన 'షోస్‌' వుంటాయి. అన్నీ 'చర్చా కార్యక్రమాలే'. చర్చ పేరుతో అర్నబ్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద పొలిటీషియన్‌ నోటిని అయినా 'షట్‌' చేసేంతలా వుంటుంది ఆయన తీరు. ఒక్కోసారి ఆయన మాట్లాడుతుండగా, అవమానానికి గురైన పలువురు పొలిటీషియన్లు ఆఫ్‌ ది రికార్డ్‌గా వాపోతారే తప్ప, ఆయనకు వార్నింగ్‌ ఇచ్చే స్థాయిలో వారి వారి పదవుల్ని సైతం ఉపయోగించడానికి సిద్ధపడరు. 

దేశంలో అతి ముఖ్యమైన నేషనల్‌ మీడియా ఛానళ్ళలో టైమ్స్‌ నై ఒకటి కావడంతో, అర్నబ్‌ 'డిక్టేటర్‌షిప్‌'కి అడ్డే లేకుండా పోతోంది. ఇండియాలోని పొలిటీషియన్లతో నోటికొచ్చినట్లు ఎలాగైతే మాట్లాడతారో, ఇతర దేశాలకు చెందిన ప్రముఖులతోనూ అంతే. మొన్నటికి మొన్న భారత సైన్యంపై, పాక్‌ ముష్కరులు యురీ ఎటాక్‌ చేసింది మొదలు, భారత్‌ – పాక్‌ మధ్య యుద్ధ వాతావరణంపై అర్నబ్‌ నిర్వహించిన షోల్లో, పాకిస్తానీ ప్రభుత్వాన్నీ, తీవ్రవాద సంస్థల్నీ ఆయన ఏకి పారేసిన వైనం.. మొత్తం దేశమంతా చూసింది. 'గట్స్‌ వున్నోడు..' అంటూ దేశమంతా అర్నబ్‌ని కీర్తించింది. 

కానీ, కీర్తి వెనుక ప్రమాదాలుంటాయి కదా. జర్నలిజం వృత్తి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తీవ్రవాదుల బెదిరింపుల్ని అర్నబ్‌ లెక్క చేస్తారా.? అంటే, చేసే ఉద్దేశ్యమే వుంటే ఆయన అంతలా, పాకిస్తాన్‌పై విరుచుకుపడరు. 'అంత గొంతేసుకుని వెర్రి కేకలు పెడ్తారు..' అనే విమర్శలున్నా, అర్నబ్‌ షోకి వున్న క్రేజ్‌ సూపర్బ్‌. ఇప్పుడీ టెర్రర్‌ బెదిరింపులు, వై కేటగిరీ భద్రతతో అర్నబ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బహుశా దేశంలో ఓ జర్నలిస్టుకి ఇంతలా భద్రత కల్పించడం ఇదే మొదటి సారేమో.!