ఐశ్వర్యారాయ్ నటించిన తాజా చిత్రం 'యే దిల్ హై ముష్కిల్' చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో నటించిన పాక్ నటుడు ఫవాద్ ఖాన్, భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో స్వదేశానికి పారిపోయాడు. పాక్ నటులపై నిషేధం కారణంగానే ఆయన అలా పారిపోవాల్సి వచ్చింది. ఇంకోపక్క ఈ సినిమా విడుదలకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ, సింగిల్ థియేటర్ ఓనర్స్ తెగేసి చెప్పారు. మరోపక్క, సెన్సార్ విషయంలో హైడ్రామా నడిచింది.
ఇప్పుడు తాజాగా, ఈ సినిమాకి సంబంధించి హాటెస్ట్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడ్తోంది. అదేంటంటే, సినిమాని రీ-సెన్సార్‌కి పంపాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ వుందనీ, కొన్ని 'స్టీమీ సీన్స్'ని ఇందులో యాడ్ చేస్తున్నారనీ బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారట. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆ గాసిప్స్‌లో ప్రచారం జరుగుతోంది.
ట్రైలర్ ఇప్పటికే సంచలనాల మీద సంచలనాల్ని నమోదు చేస్తోంది. ఐశ్వర్యారాయ్, ఈ సినిమాలో గ్లామర్ పరంగా రెచ్చిపోయింది. ఇంటిమేట్ సీన్స్‌లో మేగ్జిమమ్ కెమిస్ట్రీ చూపించేసింది హీరో రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి. ముందుగా ఆ సీన్స్ కొన్నిటిని తగ్గించి, సినిమాని సెన్సార్‌కి పంపారనీ, ఇప్పుడు మళ్ళీ సెన్సార్‌కి పంపాలన్న ఆలోచన వెనుక ఉద్దేశ్యం సినిమాని ఇంకా 'స్టీమీ'గా మార్చేయడమేనన్నది బాలీవుడ్‌లో విన్పిస్తోన్న గాసిప్స్ సారాంశం. అయితే, అదంత వీజీ కాదు.
కానీ, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న విధంగా రిలీజ్ చేయడంతోపాటు, అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకుగాను, చిత్ర నిర్మాత కరణ్ జోహార్ అందుబాటులో వున్న ఏ అవకాశాన్నీ వదులుకునేలా కన్పించడంలేదు. ఇందులో భాగంగానే, సినిమాపై హైప్ పెంచడానికి, ఐష్ – రణ్‌బీర్ స్టీమీ సీన్స్‌పై ఫోకస్ పెట్టాడట. ఐష్ నుంచి ఎటూ అభ్యంతరం లేదు.. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ప్రస్తుతానికి ఇచ్చింది.. అది 'ఎ' అయినా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు కరణ్ జోహార్.
ఏమో, ఈ గాసిప్స్‌లో నిజమెంతోగానీ, చాలాకాలం తర్వాత ఐశ్వర్యారాయ్ రెచ్చిపోయి రొమాన్స్ పండించిందంటే, ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం.. తర్వాత సినిమా టాక్ ఎలా వున్నాసరే.!