పేరు : రాహుల్ గాంధీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘అజ్ఞాత’ నేత( ఇంత వరకూ కాంగ్రెస్‌కు అజ్ఞాత నేతలు ఎవరూ లేరు. నెహ్రూ గాంధీ కుటుంబంలో కూడా జైలు కు వెళ్ళిన వారున్నారు కానీ, అజ్ఞాతంలోకి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు. రెండు వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం అందించగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాను.)
ముద్దు పేర్లు : ‘ఫ్లాపుల్’ గాంధీ.( ఏ రాష్ర్టమేగినా, ఎందు కాలిడినా… ఒక్కటే రిజల్ట్ అనీ, అన్ని ఫ్లాపులే ఇస్తున్నాననీ, ఒక్క హిట్టూ ఇవ్వలేక పోయాననీ బీజేపీ వారంటున్నారు. ఢిల్లీ ఫలితం చూసి మరీ రెచ్చిపోతున్నారు. ‘ఫ్లాపులి’వ్వకుండా డైరెక్టుగా ఇచ్చిన వాడెవడూ చరిత్రలో నిలవ లేదు.), ‘వ్యాకుల్’ గాంధీ ( ఓటమి ఎంతయనా దు:ఖాన్నిస్తుంది కదా!)
‘విద్యార్హతలు: బ్యాచిలర్ ఆఫ్ బ్యాచిలర్స్( బి.వో.బి). నాకింకా ‘ప్రధానమూ’ కాలేదు. నేనింకా ‘ప్రధాని’ నీ కాలేదు. నన్ను మించిన ‘ఎలిజిబిల్ బ్యాచిలర్’ దేశంలో ఎవరయినా వుంటారా?
గుర్తింపు చిహ్నాలు:
- ఒకటి: పాలిటిష్యన్‌కి తక్కువ; ఎన్జీవోకి ఎక్కువ. ( అందుకే పి.ఎం పదవి లాంటి పోస్టూ రాలేదు; మెగాసెసె పురస్కారం లాంటి అవార్డూ రాలేదు.)
- రెండు: నేనెక్కడున్నా నా వెంట ‘జిందాబాద్’లు, ‘స్త్రోత్ర గీతాలే’ వుంటాయి. నా అనుచర గణం వున్నారే.. వారు నా చెవికి ఏ విమర్శా చేరకుండా జాగ్రత్త పడతారు.
సిధ్ధాంతం : కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ విజయ సాధించినా, అది మా(నెహ్రూగాంధీ) వంశీయుల వల్లనే; ఎక్కడ పరాజయం పొందినా స్థానిక నేతల వల్లనే. ఇది మా శాశ్వత సిధ్ధాంతం. పార్టీ సమీక్షా సమావేశాల్లో కూడా, ఈ నిర్థారణేక పదే పదే వస్తుంటాం.
వృత్తి: అమ్మ ఏది చెబితే అది చెయ్యటం. ఆమె కూడా నన్ను అప్పుడప్పుడూ సొంతంగా ఆలోచించమంటుంది. అదేమిటో… ఎంత సొంతంగా ఆలోచించినా తిరిగి అమ్మ ఆలోచనలే వస్తుంటాయి. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అమ్మకూడా సొంతంగా ఆలోచించలేదని. వృధ్ధనేతలు కొందరు అమ్మను తప్పుదోవ పట్టిస్తున్నారు.
హాబీలు :
- సెక్యూరిటీని కూడా లెక్క చెయ్యకుండా సామాన్యుల్లో కలిసి పోవటం.
- ఎప్పటి కప్పుడు పెళ్ళి వంటి వ్యక్తిగత విషయాలను వాయిదా వేస్తుండటం.
అనుభవం : ఇది వున్న వాళ్ళు నా దరిదాపుల్లో కూడా వుండరు. అందుకే స్వఛ్చంద సంస్థల్ని నడిపిన వాళ్ళనీ, మాజీ ఐయ్యేఎస్, ఐపీయస్ అధికారులనీ, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎవరు రాజకీయాలకు దూరంగా వుంటే వారందరినీ దగ్గరకి చేర్చుకుంటాను. నేను చూడండి భూసేకరణ చట్టం చర్చకు వచ్చేసరికి గైర్హాజరు అయ్యాను. ఈ స్ఫూర్తి వున్న యువతరం నాకు కావాలి
మిత్రులు : రాకుమారుడికి మిత్రులు వుండరు. అనుచరులు తప్ప.
శత్రువులు : బాగా పెరిగిపోయారు. ముఖ్యమంత్రులు ప్రధానులయి పోయాక, ప్రధాని అభ్యర్థులు ఏమయి పోవాలి?
మిత్రశత్రువులు : కాంగ్రెస్‌లో వుంటూ మమ్నల్ని మించి ఎదిగి పోవాలనుకునే వారు. ఒకప్పటి కరుణా కరన్, వైయస్ రాజశేఖరెడ్డి వంటి వారు, ఇప్పుడూ అక్కడక్కడా వుండవచ్చు. నిన్నటి వరకూ మాకు మిత్ర పక్షంగా వున్న ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఈ కోవలోకే వస్తారు.
వేదాంతం : మా ముత్తాత, నాయనమ్మ, నాన్న అందరూ గెలిచి, గెలిచి, గెలుపు మీద విరక్తి రప్పించారు. అందుకే నేను వారికి భిన్నంగా వెళ్తున్నాను. గెలుపే రాజకీయం కాదు. ఇదీ నా వేదాంతం.
జీవిత ధ్యేయం : ప్రధాని అయ్యాక ‘ప్రధానం’ చేసుకోవాలని. కానీ ఈ పని ఒక జీవిత కాలం లేటయ్యేటట్లుగా వుంది. కానీ ఒకటి అయితే కానీ, ఒకటి అయ్యేటట్లు లేదు.
సర్