లోకులు పలు కాకులు. ఇంత ఉన్న విషయాన్ని అంత చేసి చెప్పుకుంటారు. మంచితనం కంటే చెడ్డతనం గురించే ఇష్టంగా చర్చించుకుంటారు. అది సహజం. నా గురించి ప్రజలు చెప్పుకునే సంగతులను నేనూ ఏకీభవిస్తున్నానని చెబుతుంది శృంగార నాయిక షకీలా. తన గురించి ఏకంగా పుస్తకమే రాసుకున్న గ్రంధిసాంగురాలు.
ఊహలు తెలిసినప్పటినుంచీ మగాళ్ళ ఆకలి చూపులను పసిగట్టాననీ, తాను ఎదగడానికి దగ్గరిదారి అది అని తెలిసే ప్రయాణం చేశాననీ, మొదటిసారి సిల్క్‌స్మితకు చెల్లెలిగా నటించినందుకు తీసుకున్న ఇరవై వేల రూపాయల్లో పదివేలు పేరెంట్స్‌కి ఇచ్చినప్పుడు నా గురించి ఆరా తియ్యడం మానేశారు.
ఎంతోమంది దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. నా గురించి చాటుగా మాట్లాడుకునే వాళ్ళ మీద మొదట్లో కోపం వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. నేను ఒక బ్రాండ్ ఇమేజ్‌లో వర్క్ చేసుకుంటూ పోయాను కాబట్టి నా మీద ఆ ముద్ర వుంది.
నా వీడియోలు, సినిమాలూ కొంతమందికి ఆనందం కలిగించడం సంతోషించదగ్గ విషయమే. నా అనుభవాలు దర్శకత్వం చెయ్యడానికి పనికొస్తాయి కాబట్టి ఆ ఆలోచనలు అమలు చెయ్యాలనుకుంటున్నానంటుంది షకీలా.