అందమైన అమ్మాయిని చూస్తే ఎంత ఆహ్లాదంగా వుంటుందో ఆమె వెనుక వుండే గొడవలు చూస్తే అంత టెన్షన్లూ వుండకపోవు. ప్రఖ్యాత యాంకర్ శిల్పా చక్రవర్తి స్కూల్ డేస్‌లో వుండగా తనకు తెలియకుండానే ఆమెకోసం గ్రౌండ్‌లో తన్నుకున్నారట.
ఆమెను నేను లవ్ చేస్తున్నానంటే కాదు కాదు నేను లవ్ చేస్తున్నా.. అని ఫుట్ బాల్ గ్రౌండ్‌లో ఇద్దరు కుర్రాలు చొక్కాలు చించుకుంటుంటే ప్రిన్సిపాల్ ద్వారా ఆ సంగతిని తెలుసుకుని బాధపడిరదట. నా ప్రమేయం లేకుండా వాళ్ళు తన్నుకోవడం విచిత్రం అంటుంది.
బెంగాల్ నుంచి ఉద్యోగ రీత్యా ఎన్నో ప్రాంతాలు తిరిగి చివరిగా హైద్రాబాద్‌లో స్థిరపడ్డ శిల్పాకు తెలుగు తెలిసేది కాదట. బెంగాలీ సమాజంలో నృత్య ప్రదర్శన ఇస్తుంటే ఒక టీవీ కెమెరామెన్ సరదాపడి తమ ఛానెల్‌కు యాంకర్‌గా రమ్మని ఆహ్వానించాడట. అలా సెలక్ట్ అయిన శిల్ప సంతూర్ టాప్ టెన్, డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్‌తో యాంకర్‌గా లంగరేసింది.
బాలాజీ టెలి ఫిలింస్ వాళ్లు తీసిన ఒక సీరియల్‌లో నటించడానికి వెళ్ళినప్పుడు తెలుగు రాని శిల్పాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవమానించాడట. దాంతో పట్టుదలగా తెలుగులో మాట్లాడటమే కాకుండా రాయడం కూడా నేర్చుకుందట. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ తనకు హీరోయిన్‌గా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిందట అవగాహన లేక. ఆ సినిమాకు హీరో శ్రీకాంత్ అట.
ఆ సినిమా చేసి వుంటే హీరోయిన్‌గా సెటిలయ్యేదాన్ననీ అదొక బ్యాడ్ లక్ అనీ చెబుతున్న శిల్పా చక్రవర్తి తనతో పోట్లాడి గొడవలు పెట్టుకున్న జర్నలిస్ట్‌నే లవ్ చేసి, ఆర్య సమాజ్‌లో పెళ్ళి చేసుకుని తెలుగువారి కోడలయ్యిందట. ఆమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నానని చెబుతుంది శిల్పా చక్రవర్తి.