చంపేస్తే.. చచ్చిపోవాల్సిందేనా.?

'పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదం తోక ముడిచింది..'  Advertisement – కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేసిన వ్యాఖ్యల సారాంశమిది.  మనోహర్‌ పారికర్‌ వ్యాఖ్యల్లో కొంత నిజం వుంది. జమ్మూకాశ్మీర్‌లో కర్‌ఫ్యూ…

'పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదం తోక ముడిచింది..' 

– కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేసిన వ్యాఖ్యల సారాంశమిది. 

మనోహర్‌ పారికర్‌ వ్యాఖ్యల్లో కొంత నిజం వుంది. జమ్మూకాశ్మీర్‌లో కర్‌ఫ్యూ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. కానీ, తీవ్రవాదం మాత్రం కోరలు చాస్తూనే వుంది. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం, సరిహద్దుల్లో భారత సైన్యంపై బుసలు కొడుతూనే వుంది. భారత సైన్యం బలవుతూనే వుంది. అలా ఇలా కాదు, మొన్నటి యురీ ఘటనను తలపించేలా జమ్మూకాశ్మీర్‌లో మరో ఘటన అచ్చం.. అలాంటిదే జరిగింది. ఈసారి ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 7. 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత పాకిస్తాన్‌ తోక ముడిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. పైగా, పాకిస్తాన్‌ ఇంకా ఇంకా రెచ్చిపోతూనే వుంది. దానికి కారణాలూ లేకపోలేదు, భారత్‌ ఏం చేసినాసరే.. తమ మీద యుద్ధానికి రాదు గనుక, వీలైనంత ఎక్కువగా భారత్‌కి తీవ్రవాదం పేరుతో నష్టం కలిగించడమే పాకిస్తాన్‌ ముఖ్య ఉద్దేశ్యం. 

ఇప్పుడేం చేద్దాం.? పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం ద్వారా ప్రమాదకర పరిస్థితులు కొనితెచ్చుకోలేం. అలాగని, సరిహద్దుల్లో నిత్యం సైన్యాన్ని బలి చేసేయలేం. అను నిత్యం ఇదో రొటీన్‌ వ్యవహారంలా మారిపోయింది. తీవ్రవాదుల ఎటాక్‌, సైన్యం ఎదురుదాడి.. అటు తీవ్రవాదుల హతం, ఇటు అమరులైన భారత జవాన్లు.. ఇదేనా.? ఇంతకు మించి, ఏమీ చెయ్యలేమా.? సగటు భారతీయుడి ఆవేదన ఇది. 

పరిష్కారం లేని సమస్యలా తయారయ్యిందిది. గతంలోనూ పాకిస్తాన్‌ – భారత్‌ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇప్పుడున్నంత స్థాయిలో మాత్రం కాదు. తీవ్రవాదులు ఒకప్పుడు దేశంలో అల్లకల్లోలం సృష్టించేవారు.. ఇప్పుడు అది కాస్త తగ్గింది.. కానీ, తీవ్రవాదులు సరిహద్దుల్లో జవాన్లను బలిగొంటున్నారు.. ఈ క్రమంలో సామాన్యులూ ప్రాణాలు కోల్పోతున్నారు. అటు పాకిస్తాన్‌కీ నష్టం కలుగుతోంది.. ఇటు భారత్‌ వైపు కూడా నష్టం గట్టిగానే వుంటోంది. 

పాకిస్తాన్‌కి సమస్య లేదు.. ఎందుకంటే, అది పాపాల పాపిస్తాన్‌. తీవ్రవాదాన్ని ఎగదోయడమే దాని పని. భారత్‌ అలా కాదు కదా, సంయమనం పాటిస్తూనే వుంది.. ప్రాణ నష్టాన్ని భరిస్తూనే వుంది. ఇంకెన్నాళ్ళు.? సైన్యాన్ని ఇంకెన్నాళ్ళిలా బలిపెడ్తాం.? ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే. ఆ పరిష్కారం పాకిస్తాన్‌తో యుద్ధమే కావొచ్చు కూడా. తప్పదు, రోజూ చచ్చేకంటే, ఒక్కసారి చంపేస్తే బెటర్‌. ఇది సైన్యం మనసులో మాట. ఎందుకంటే, వరుస ఘటనలతో సైన్యం ఆత్మస్థయిర్యం దెబ్బతినే ప్రమాదముంది.. ఏమీ చెయ్యలేకపోతున్నామనే ఆవేదనతో. వారి ఆవేదనా అర్థం చేసుకోదగ్గదే.