పతకం గెలిస్తేనే.. మన దృష్టిలో గొప్ప. అంతగా మొహం వాచి ఉన్నాం మరి. మాటెత్తితే వంద కోట్ల జనాభా ఉంది, పదో రోజుకు కూడా ఖాతా ఓపెన్ చేయడంలా అంటూ బాధపడటంతో మనోళ్లు ముందున్నారు. బాధపడితేనో, పతకాలు గెలుస్తున్న దేశాలను చూసి కుళ్లకుంటేనో స్వర్ణాలు రావు. ఆయా దేశాలు ఈ విషయంలో ఎలాంటి కసరత్తు చేస్తున్నాయో తెలుసుకుని.. ప్రభుత్వమూ, ప్రజలు ఆచరిస్తే.. పతకాలు ఖాయంగా వస్తాయి.
ఈ సంగతిలా ఉంటే.. జిమ్నాస్టిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిపోయి పతకాన్ని సాధించలేకపోయిన దీప కర్మకర్ ను మనోళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. ఒక అరుదైన వ్యక్తి నుంచి ప్రశంసలు దక్కాయి. పతకాల టేబుల్ లో పతాక స్థాయిలో ఉన్న ఆస్ట్రేలియన్ ప్రశంసలు ఇవి. ఒకవైపు ఆస్ట్రేలియన్ అథ్లెట్లు ఒలింపిక్స్ లో దూసుకుపోతుండగా.. ఆదేశ మాజీ క్రికెటర్ అడామ్ గిల్ క్రిస్ట్ దీపికను ప్రశంసల్లో ముంచెత్తాడు.
తన ట్విటర్ అకౌంట్ ద్వారా దీపికను ప్రశంసిస్తూ గిల్ క్రిస్ట్ ట్వీట్ పెట్టాడు. పతకం గెలవకపోయినా దీప భారతీయుల హృదయాలతో పాటు.. ప్రపంచంలోని అందరి హృదయాలనూ గెలిచిందని గిల్ క్రిస్ట్ ట్వీట్ పెట్టాడు. మరి మన బంగారానికి విదేశాల నుంచి , అది కూడా ఒలింపిక్స్ లో దూసుకుపోయే ఆస్ట్రేలియా నుంచి, అందునా.. విశ్వవిఖ్యాత క్రికెటర్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మరి భారతీయులు ఇప్పటికైనా దీపిక ప్రతిభను గుర్తించి, గౌరవిస్తారా?