పెళ్లి ఖాయం అన్నారు.. రణ్ బీర్ కపూర్ , కత్రినాల పెళ్లికి వాళ్ల వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే మాట వినిపించింది. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.. పెళ్లి చేసుకోబోతున్నారు.. కపూర్ ఫ్యామిలీకి మరో హీరోయిన్ కోడలిగా వెళ్లి బోతోందని విశ్లేషించారు. దానికి తోడు విదేశీ బీచ్ లలో కత్రినా, రణ్ బీర్ లు కలిసి కనిపించారు! దీంతో పెళ్లి ఖాయమేమో అనుకున్నారంతా.
అయితే సెలబ్రిటీల మనసులు చాలా త్వరగా మారిపోతాయి.. వారికి ఎంతమందిని ప్రేమించేంతటి మనసైనా ఉంటుందని మరోసారి రుజువు అవుతోందిప్పుడు. ఎందుకంటే.. కత్రినాకైఫ్ ఇప్పుడు మరో హీరో తో డేటింగ్ మొదలుపెట్టిందని అంటున్నారు బాలీవుడ్ జనాలు.
వివాహం చేసేసుకొంటారు అనేంత దశ నుంచి.. కొన్ని నెలల కిందటే రణ్ బీర్ తో బ్రేకప్ దశకు వచ్చింది కత్రినా. ఈ నేపథ్యంలో కత్రినాకైఫ్ మరో బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉందని సమాచారం. ఈ సారి ఆదిత్యా రాయ్ కపూర్. ఈ హ్యాండ్సమ్ హీరో, వీరి సాన్నిహిత్యం విదేశాల్లో విహరించేంత వరకూ వచ్చిందని సమాచారం. అయితే ఇది స్నేహం మాత్రమే అంటోందట కత్రినా. మరి ఈ స్నేహం.. ఎంత వరకూ వస్తుందో.. ఎక్కడ వీగిపోతుందో వెయిట్ అండ్ సీ!