‘బాబు’కు తిక్క తెచ్చిన అదృష్టం

తుంటి మీద కొడితే పళ్లు రాల్తాయా? అంటే సినిమాల్లో సాధ్యమే. వెంకీ-మారుతి కాంబినేషన్ లోని బాబు బంగారం మిక్స్ డ్ సమీక్షలు అందుకుంది. 25 కోట్ల మేరకు అమ్మకాలు సాగించిన ఈ సినిమా ముఫై…

తుంటి మీద కొడితే పళ్లు రాల్తాయా? అంటే సినిమాల్లో సాధ్యమే. వెంకీ-మారుతి కాంబినేషన్ లోని బాబు బంగారం మిక్స్ డ్ సమీక్షలు అందుకుంది. 25 కోట్ల మేరకు అమ్మకాలు సాగించిన ఈ సినిమా ముఫై కోట్ల మేరకు కలెక్ట్ చేసి, బయ్యర్లను సేఫ్ జోన్ కు చేర్చడం సంగతి అలా వుంచి, ఎంత శాతం నష్టాలు ఇస్తుంది అని లెక్కలు కట్టడం ప్రారంభమైపోయింది తొలి నాడే. 

అయితే నాలుగు రోజులు సెలవు రావడం సంగతి అలా వుంచి, బంగారం వచ్చిన మర్నాడే విడుదలైన తిక్క సినిమా డిజాస్టర్ కావడం అన్నది భలే కలిసి వచ్చేసింది. నాలుగు రోజుల పాటు ఫుల్ గా కలెక్షన్లు దున్నుకున్న బంగారం భవిష్యత్ మంగళవారం బయటపడుతుంది అని అనుకున్నారు  ట్రేడ్ పండితులు అంతా. 

అయితే మంగళవారం నాడు కూడా స్టడీగా వుండడం కాకుండా ఫుల్స్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ఎగ్జిబిటర్ సర్కిళ్ల నుంచి ఒకటే సమాధానం వినిపిస్తోంది. సరైన సినిమా లేదు, థియేటర్లలో అని. పైగా బంగారం సినిమాకు టీవీల్లో వస్తున్న ప్రోమోలు అత్యంత ఆకర్షణీయంగా వున్నాయి. దాంతో ఫన్ కనిపిస్తోందని జనం ఓకె…బంగారం అంటున్నారట.

దీనికి తోడు రేపు రాబోయే గురువారం రాఖీ పున్నమి సెలవు వస్తోంది. అది కూడా కలిసి వచ్చే అంశమే. మరి ఇది హారిక హాసిని చినబాబు అదృష్టమో, మారుతి అదృష్టమో? కానీ శుక్రవారం విడుదలవుతున్న రెండు సినిమాలు కూడా కామెడీ సినిమాలే. వాటి ఫలితమే బంగారం బ్రేక్ ఈవెన్ ను నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాటికి ఎంతకుమ్ముకున్నా, బంగారం కలెక్షన్లు 18 కోట్లకు లోగానే వుండే అవకాశం వుంది. మరి అప్పటికి ఇంకా 20శాతం పైగా డెఫిసిట్ వుంటుంది.