అత్యంత సెక్సీగా ఉండేది ఆ దేశం జనాలే..!

ఆకట్టుకొనే రూపంతో ఉండే వాళ్లు ఏ దేశంలో ఎక్కువమంది ఉన్నారు? ఏ జాతీయులు అలజడి రేపే రూపంతో సెక్సీయెస్ట్ అనిపించుకొంటారు? ఒకరిద్దరు అని కాకుండా.. ఎక్కువమంది సెక్సీయెస్ట్ వ్యక్తులు ఉండే దేశాలు ఏవి? అనే…

ఆకట్టుకొనే రూపంతో ఉండే వాళ్లు ఏ దేశంలో ఎక్కువమంది ఉన్నారు? ఏ జాతీయులు అలజడి రేపే రూపంతో సెక్సీయెస్ట్ అనిపించుకొంటారు? ఒకరిద్దరు అని కాకుండా.. ఎక్కువమంది సెక్సీయెస్ట్ వ్యక్తులు ఉండే దేశాలు ఏవి? అనే అంశాల గురించి సర్వేను సాగించింది ఒక వెబ్ సైట్. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. లక్షల మంది అభిప్రాయాలను తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో పురుషుల, మహిళల విభాగాల్లో సెక్సీయెస్ట్ నేషనాలిటీస్ గా నిలిచిన దేశాల జాబితా ఇలా ఉంది..

ఆర్మేనియన్ అమ్మాయిలు ఈ ప్రపంచంలోనే అత్యంత సెక్సీయెస్ట్ అంట. ఆ తర్వాత అమెరికన్ , కొలంబియా, ఇంగ్లిష్, ఆస్ట్రేలియన్, బ్రెజిలియన్, బల్గేరియన్ , లెబనీస్ అమ్మాయిలు సెక్సీదనం విషయంలో మెజారిటీ జనాల మద్దతును పొంది వరస స్థానాల్లో నిలిచారు.

పురుషుల, అబ్బాయిల విషయంలో మొదటి స్థానంలో నిలిచారు ఐరిష్ వాళ్లు. ఈ యూరోపియన్ కంట్రీ మగాళ్లు కత్తుల్లాగా ఉంటారని ఈ సర్వేలో పాలుపంచుకొన్న వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకొన్నారు ఆస్ట్రేలియన్లు. విశేషం ఏమిటంటే మగాళ్ల సెక్సీదనం విషయంలో మూడో స్థానంలో ఉన్నది పాకిస్తానీయులు! పాక్ మగాళ్లు ఈ విధమైన హోదాను పొందారు. ఆ తర్వాత అమెరికన్ , ఇంగ్లిష్, స్కాటిష్, ఇటాలియన్, నైజీరియన్ , డ్యానిష్, స్పానిష్ మగాళ్లు నెటిజన్ల మద్దతు పొందారు.

అయితే అటు మహిళ ల జాబితాలో కానీ, పురుషుల జాబితాలో కానీ ఇండియన్స్ కు స్థానం లభించకపోవడం విశేషం.