చైతూ సినిమా మొదలవుతోందా?

ఆటోనగర్ సూర్య,. దోచేయ్..రెండు షాక్ లు నాగచైతన్యకు. మంచి దర్శకులు అని నమ్మితే, ఒకరు ఓ మాదిరి సినిమా మరొకరు జిరాక్స్ కాపీ తీసి చేతిలో పెట్టారు. అయినా నిరాశ చెందకుండా మరో రెండు…

ఆటోనగర్ సూర్య,. దోచేయ్..రెండు షాక్ లు నాగచైతన్యకు. మంచి దర్శకులు అని నమ్మితే, ఒకరు ఓ మాదిరి సినిమా మరొకరు జిరాక్స్ కాపీ తీసి చేతిలో పెట్టారు. అయినా నిరాశ చెందకుండా మరో రెండు సినిమాలు సిద్దం చేస్తున్నాడు చైతన్య. 

అందులో ఒకటి గుట్టు చప్పుడు కాకుండా చెన్నయ్ లో శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. చైతన్యకు తొలి హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ ఈ  సినిమాకు దర్శకుడు. గౌతమ్ మీనన్ మాంచి రొమాంటిక్ సినిమాలే కాదు, ఘర్షణ లాంటి యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. 

ఇప్పుడు చైతూ సినిమా ఈ రెండింటి కాంబినేషన్ లో వుంటుందని తెలుస్తోంది. సాధారణంగా గౌతమ్ మీనన్ తెలుగు, తమిళ వెర్షన్లు ప్లాన్ చేస్తాడు. అక్కడ స్టార్ కాస్ట్ వేరుగా వుంటుంది. మరి ఈ సినిమాకు ఎవర్ని సెట్ చేసాడో తెలియదు.