ఓర్లాండో, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' ఒర్లాండో లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇండియా నెట్ వర్క్ ఫౌండేషన్ తో కలిసి నాట్స్ నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. మొత్తం 17 టీంలు వాలీబాల్ ఆడటంతో తమ సత్తా చూపాయి. దాదాపు 300 మంది తెలుగువారు ఫ్లోరిడా నుంచి ఈ వాలీబాల్ టోర్నమెంట్ ను వీక్షించారు. మెరిల్లీ పార్క్ లోని వాలీబాల్ కోర్టులో జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది.
17 టీంలను గ్రూపుఏ, గ్రూపు బీలుగా టీంలను విభజించి ఈ టోర్నమెంటు నిర్వహించారు. నాలుగు టీంలు సెమీఫైనల్ కు రెండు టీంలు గ్రాండ్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఆటగాళ్ల ఉత్సాహంతో ఎండవేడి కూడా లెక్కచేయకుండా ఆడారు. తొలుత నాట్స్ కార్యనిర్వహక కమిటీ ప్రతినిధి సాయి ప్రభాకర్ యర్రాప్రగడ వాలీబాల్ టీంలను ఆహ్వనించారు. ఇండియా నెట్ వర్క్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ కె.విరావు, వ్యూజన్360 బార్ అండ్ లాంజ్ నుంచి డాక్టర్ భాస్కర్ రాజు, డాక్టర్ సూర్యనారాయణ చల్లపల్లి, డాక్టర్ విజయ్ కర్ర, శ్రీ జలంధర్ ఎలిగేటి, రవి గంధి, రాజేష్ కేశినేని లాంటి స్థానిక తెలుగు ప్రముఖులు ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు అతిధులుగా విచ్చేశారు.
ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో ప్రీమియర్ లీగ్ లో ఉన్న డేర్ డెవిల్స్ ఒర్లాండో, పేట్రియాట్స్ ఓర్లాండో టీంలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. స్టార్ లీగ్ లో స్ట్రైకర్స్ మైమీ, హెచ్ సీ1 ఓర్లాండో టీంలు ఫైనల్ కు చేరాయి. చివరకు ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్ లో డేర్ డెవిల్స్ ఓర్లాండో, స్ట్రైకర్స్ మైమీ టీంలు విన్నింగ్ కప్స్ సొంతం చేసుకున్నాయి. పేట్రియట్స్ ఓర్లాండో, హెచ్ సీ1 టీంలు రెండవ స్థానంలో నిలిచి ఈ టోర్నమెంట్ లో రన్నరప్ కప్ లు దక్కించుకున్నాయి.
నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గురించి సాయి ప్రభాకర్ యర్రాప్రగడ వివరించారు. నాట్స్ హెల్ఫ్ లైన్ అమెరికాలో తెలుగువారికి ఎలా ఉపయోగడపడుతుంది.? ఎంతమంది సేవలు అందించిందనేది సాయి ప్రభాకర్ సవివరంగా తెలిపారు. జులై 2,3,4 తేదీల్లో లాస్ ఏంజిల్స్ వేదికగా నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని ఆయన కోరారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నాట్స్ నిర్వహించే వుడ్ డ్రైవ్ గురించి కూడా సాయి ప్రభాకర్ వివరించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు సహకరించిన స్పాన్సర్లకు, టోర్నమెంట్ లో స్వచ్చంధంగా సేవలు అందించిన వాలంటీర్లకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ కె.వి.రావు, డాక్టర్ భాస్కర్ రాజు, డాక్టర్ విజయ్ కర్రా, డాక్టర్ చల్లపల్లి, సతీష్ వడ్డి, సత్య మంతెనలు స్థానిక తెలుగు కమ్యూనిటీకి అందించిన సేవలను కొనియాడుతూ నాట్స్ వారిని సత్కరించింది.
విజిటర్స్ ఇన్సురెన్స్ గురించి డాక్టర్ కేవీ రావు ఈ సందర్భంగా వివరించారు. ఇండియా నెట్ వర్క్ ఫౌండేషన్ స్పాన్సర్ షిప్ తో ఇలాంటి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందని డాక్టర్ కేవీరావు అన్నారు. నాట్స్ కప్ వాలీబాల్ 2015, విన్నర్స్, రన్నర్స్ తో పాటు అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకు స్థానిక తెలుగు సంఘం నాయకులు.. బహుమతులు అందించారు. ఈ బహుమతులను కూడా ఇండియా నెట్ వర్క్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసింది. వ్యూజన్ 360 బార్ అండ్ లాంజ్ చక్కటి విందును ఈ వాలీబాల్ టోర్నమెంట్ విచ్చేసిన వారందరికి ఇచ్చింది. సతీష్ వడ్డి, సత్య మంతెన, రాజేష్ కేశినేని, రత్న బొల్లినేని తదితరులు ఈ వాల్ బాల్ టోర్నమెంట్ కోసం చేసిన కృషి నాట్స్ అభినందించింది.