ఇది మీ లైఫ్.. మీకు నచ్చినట్టుగా ఆస్వాధించండి.. ఆస్వాధనకు ప్రమాణాలు లేకపోవచ్చు.. అనుభవమే పరమావధి… అంటూ గుడ్‌సెక్స్‌కు నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేశారు పరిశోధకులు. మాగ్జిమ్‌లో ప్రచురితం అయిన అధ్యయనం ఇది. గుడ్‌సెక్స్‌కు పలు నిర్వచనాలు ఇచ్చారు ఈ అధ్యయనకర్తలు. గుడ్‌సెక్స్‌కీ ముందుగా.. దంపతులు ఓపెనప్ కావడమే అని వారు పేర్కొన్నారు.
మీ ఫాంటసీలను, సెక్సువల్ డ్రీమ్స్‌ను షేర్ చేసుకోండి.. అవి మరీ ఆడ్‌గా, ఆచరించడానికి వీలు కానట్టుగా ఉంటే వదిలేయండి.. లేకపోతే సెక్సువల్ ఫాంటసీల గురించి పరస్పరం వివరించుకోవడంతో మజా మొదలవుతుందని ఈ అధ్యయనం పేర్కొన్నారు. ఆచరణ సాధ్యమైన ఫాంటసీలు ఒకరినొకరిని ఎంకరేజ్ చేస్తాయని అధ్యయనకర్తలు వివరించారు.
ఇక శృంగారాన్ని చేయదగ్గ వ్యవధి గురించి కూడా అధ్యయనకర్తలు ప్రత్యేకంగా వివరించారు. రెండు నిమిషాల నుంచి రెండు గంటలా ఏడుసెకన్ల వరకూ.. అంటూ శృంగార వ్యవధి గురించి అధ్యయనకర్తలు పేర్కొన్నారు. శృంగారాచరించే వ్యవధిని బట్టి సెక్స్‌ను వర్గీకరించవచ్చని వివరించారు. రెండు నిమిషాల్లోనే పని ముగించడాన్ని 'టూ ఎర్లీ'గా అభివర్ణించారు. మూడు నుంచి ఏడు నిమిషాల పాటు సాగించే సెక్స్‌రైడ్‌ను 'ఫర్వాలేదు'' 'సంతృప్తికరం''గా పేర్కొన్నారు.
ఏడు నుంచి పదమూడు నిమిషాల వరకూ సాగిస్తే.. దాంట్లో కిక్ ఉన్నట్టే అని పరిశోధకులు వివరించారు. ఆ వ్యవధి శృంగారాన్ని 'డిసైరబుల్' అని ఊరించారు. ఇక పది నుంచి ముప్పై నిమిషాల వరకూ సాగించే శృంగారకాండను ''టూ లాంగ్'గా పేర్కొన్నారు.
మరి ఇంతకీ ఐడల్‌టైమ్ ఏదంట.. ఏడు నుంచి పదమూడు నిమిషాల పాటు సాగించేదన్నారు. ఫోర్ ప్లే దీనికి అదనమని పేర్కొన్నారు!