దాంపత్యంలో శృంగారాన్ని ఆస్వాధించడం అనేది కరతలామలకమైనదేమీ కాదు! శృంగారంలో పరస్పర అవగాహన, కమ్యూనికేషన్, పరస్పర ఇష్టాలను గుర్తించడం ఇలాంటివెన్నో ముడిపడి ఉంటాయి. శృంగారం గురించి శారీరకమైన ఇష్టం, శారీరకమైన సామర్థ్యం సంగతలా ఉంచితే.. శృంగారం మానసికమైనది కూడా! మనిషి సెక్సువల్ ఆపరేషన్ కేవలం లైంగికావయవాల్లో మాత్రమే ఉండదు.
శృంగార స్పందనలను మైండ్ కూడా నిర్దేశిస్తుంది! శృంగార మానసికమైన ఆనందం కూడా! మానసికమైన స్పందన కూడా! ఆరోగ్యకరమైన శృంగారంలో మానసికమైన ఆనందాన్ని ఇస్తుంది. అదే వేరే తరహా శృంగారం అది పూర్తయిన తర్వాత గిల్టీ ఫీలింగ్ ను కూడా ఇవ్వొచ్చు. శృంగారం కేవలం శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు, మెదడుకు కూడా సంబంధించినదని ఇలా చెప్పవచ్చు.
ఆ సంగతలా ఉంటే.. శృంగారాన్ని తనివితీరా ఆస్వాధించడానికి మానసికమైన అంశాలు ఎలా ముడిపడి ఉంటాయో, పరస్పరం చొరవ తీసుకోవడం కూడా ఇంతే కీలకమైన అంశం అని అంటున్నాయి పరిశోధనలు . ఎలాంటి దంపతులు శృంగారంలో ఆనందంగా ఉంటారు, వీలైనంత ఎక్కువగా శృంగారాన్ని ఆస్వాధిస్తారు? అనే అంశంపై నార్వేయియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా కొన్ని వందల మంది దంపతుల అభిప్రాయాలను, వారి శృంగార జీవితం గురించి వివరణలను తీసుకుంది. మరి ఈ స్టడీ మూలంగా తేలిందేమిటంటే…. శృంగారంలో ఆనందం ముడిపడిన విషయాల్లో కీలకమైన వాటిల్లో ఒకటి స్త్రీ చొరవ!
ఆనందమయమైన శృంగార జీవితాన్ని గడుపుతున్న జంటల్లో… ఈ అధ్యయనం ద్వారా తేలినది అది. ఏ దాంపత్యంలో అయితే స్త్రీ శృంగారం పట్ల ఇష్టంలో, చొరవతో స్పందిస్తుందో.. అలాంటి జంటలు శృంగారాన్ని తనివితీరా ఆస్వాధిస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతూ ఉంది. స్త్రీ చొరవ చూపించడం అంటే.. అదేదో బూతు అనో, అది అసహజమైనది అనో భావించే వాళ్లు శృంగారంలో వెనుకబడే ఉన్నారట! స్త్రీ లైంగికాసక్తిని చూపించడం గురించి ఆమె వెనుకడుగు వేసినా, లేదా పార్ట్ నర్ ఏమైనా అనుకుంటాడనే భయంతో.. ఆమె చొరవ చూపించడానికి వెనుకాడినా.. వారి దాంపత్యంలో శృంగారం అంతంతమాత్రంగానే ఉంటుందనేది ఈ అధ్యయనం చెబుతున్న విషయం.
స్త్రీ లైంగిక ఆసక్తిని చూపితే పురుషుడు సిద్ధంగా ఉండవచ్చు. అయితే తను ఆసక్తి చూపితే అతడు ఏమనుకుంటాడో.. అనే ఆలోచనలు ఉన్న చోట స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడలేకపోవచ్చు! అయితే లేడీని ఈ మాత్రం కూడా స్పందించనీయకుండా కట్టడి చేసే పురుషులుంటారా? అంటే! అది అంత తేలికగా సమాధానం దొరికే ప్రశ్న కాదు.
దాంపత్యంలో శృంగారం పట్ల ఉత్సుకతతో, ఆసక్తితో ఉంటే స్త్రీ వల్ల ఇరువురి శృంగార జీవితం అత్యద్భుతంగా ఉంటుందనేది ఈ అధ్యయనం చెబుతున్న మాట. శృంగారం పట్ల ఆసక్తి కలిగిన స్త్రీ.. భర్తతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా పూర్తి స్పష్టతతో ఉండవచ్చు. అప్పుడు శృంగారం రసమయం కావొచ్చు. మరి స్త్రీ స్పందిస్తేనే.. శృంగారం ఉత్సాహవంతంగా ఉంటుందనే థియరీ ఇలా వినిపిస్తోంది!