జీవితం లో కష్టాలు, అపజయాలు ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా, కొన్ని సమయాలలో అనుకొన్న ఫలితాలు దక్కవు. అది వృత్తిరీత్యా కావచ్చు, వ్యక్తిగతం గా కావచ్చు. ఎంత శ్రమించినా కష్టాల ఊబి నుండి బయటపడడానికి కష్టతరమవుతాయి. కష్టపడే తత్వం తో పాటు గా అదృష్టం అనేది కూడా ఎంతో కొంత కలిస్తే కానీ జీవితం లో సమస్యలను అధిగమించి ముందుకు సాగలేము.
జ్యోతిష్య శాస్త్రరీత్యా మనకి సమస్యలని బట్టి ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి అవసరాన్ని బట్టి అవకాశాలని బట్టి పరిహారాలని పాటించి మంచి ఫలితాలని పొందవచ్చు. సమస్యలని బట్టి వారి జాతకరీత్యా ఎటువంటి దోషాల వలన సమస్యలు ఎదురుకొంటున్నారో తెలుస్తుంది.
గత జన్మల వలన కూడా కొన్ని సందర్భాలలో ఈ జన్మ లో మనం కష్టనష్టాలను ఎదురుకోవలసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కేవలం డబ్బు ఖర్చు చేసి చేసే పరిహారాలు కాకుండా మనకి అనుదుబాటులో ఉన్నటువంటి అత్యంత సులభం గా లభించే వాటి తో పరిహారాలు పాటించి సమస్యల నుండి బయటపడవచ్చు. అలా సులభం గా లభించే వాటి లో మంచి నీరు ఒకటి. మంచి నీటి తో ఆచరించే ఎన్నో అద్భుత పరిహరాలు జ్యోతిష్యం లో ఉన్నాయి.
మనం కష్టాలు నష్టాలు ఎదురుకొంటునప్పుడు అందులో నుండి బయటపడడానికి ఆచరించాల్సిన చక్కటి పరిహారాల్లో ఒకటి “ప్రతి రోజు స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పసుపు కలిపి స్నానం చేయడం వలన అదృష్టాన్ని పెంపొందించుకొవచ్చు. దీని వలన శారీరిక శుద్ధి, ఆరోగ్యం కలుగుతాయి”. పసుపు మరియు నెయ్యి లో ఔషధ గుణాలు ఉన్నాయని సైన్స్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది.
అలాగే జాతకరీత్యా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. వివిధ రకాల సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు సులభతరమవుతాయి. అత్యంత సులభం గా ఆచరించగలిగే ఈ పరిహారం ద్వారా మనం మంచి ఫలితాలని పొందవచ్చు.
– వక్కంతం చంద్రమౌళి