మొన్నామధ్య ఓ మహిళా కానిస్టేబుల్, తన భర్త మరో మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం నడుపుతున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఉదంతం పెద్ద కలకలం సృష్టించింది. పోలీసు శాఖలోనే ఈ వైపరీత్యమా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. తాజాగా హైద్రాబాద్‌లో ఓ సీఐ, ఓ మహిళా ఎస్ఐతో కలిసి లాడ్జిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు.
తన భార్య, ఓ సీఐతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందంటూ సదరు మహిళా ఎస్ఐ భర్త గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యకు ఎంత నచ్చజెప్పినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో, రెడ్ హ్యాండెడ్‌గా వారిద్దరినీ పట్టుకోవాలనుకున్నాడా భర్త. అసెంబ్లీ సమావేశాలకు బందోబస్తు సందర్భంగా హైద్రాబాద్ వచ్చిన సీఐ, ఎస్ఐ ఒకే హోటల్లో రెండు రూమ్‌లు బుక్ చేసుకున్నారు. వాస్తవానికి సీఐకి వేరే చోట బస వున్నా, మహిళా ఎస్ఐ బస చేసిన హోట్‌లో ఆమె రూమ్ పక్కనే మరో రూమ్ తీసుకోవడం గమనార్హం.
విషయం తెలుసుకున్న మహిళా ఎస్ఐ భర్త, అర్థరాత్రి తన భార్యతో కలిసి వున్న సీఐని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఘటనతో షాక్ తిన్న సీఐ, మహిళా ఎస్ఐ రూం నుంచి పరుగులు తీశాడు. జరిగిన ఘటనపై పోలీసుకు ఫిర్యాదు చేశాడు మహిళా ఎస్ఐ భర్త. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
అక్రమ సంబంధాలకు పోలీసు శాఖ అతీతం కాదని గతంలోనే చాలా ఘటనలు నిరూపించగా.. ఇంత బరితెగింపు ఇప్పటిదాకా చూడలేదని పోలీసు శాఖలోనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గిట్టనివారు కుట్రపూరితంగా తమను ఇరికించారని మహిళా ఎస్ఐ, సీఐ వాపోతున్నారట.
మహిళా ఎస్ఐ వరంగల్ జిల్లాకి చెందిన ఓ మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, కరీంనగలో విధులు నిర్వహిస్తున్నారు సీఐ.