క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య ఎఫైర్ గురించి చాన్నాళ్లుగా గాసిప్స్ వస్తూనే వున్నాయి. ఆ గాసిప్స్‌ని కొట్టి పారేస్తూనే, వారిద్దరూ చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు.. మీడియాకి అడపా దడపా చిక్కేస్తున్నారు కూడా. ఇక, క్రికెటర్‌గా విదేశీ పర్యటనల్లో వుంటున్నప్పుడూ కోహ్లీ, తనతోపాటు అనుష్కనీ తీసుకెళ్తున్నాడనే గాసిప్స్‌కి కొదవే లేదు. అనుష్క ప్రత్యేకంగా విదేశీ టూర్లకు వెళుతూ, మీడియాకి చిక్కకుండా కోహ్లీతో డేటింగ్ కొనసాగిస్తూ వచ్చింది. ఆ వ్యవహారం ఇప్పుడు బట్టబయలయ్యింది.
బీసీసీఐ అనుమతితోనే కోహ్లీ, అనుష్కని తనతోపాటు తీసుకెళ్తున్నాడనే విషయం బయటపడేసరికి అంతా షాక్ తిన్నారు. క్రికెట్‌లో మునుపెన్నడూ ఎవరూ ప్రదర్శించనంత దూకుడు ప్రదర్శిస్తూ, తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న కోహ్లీ, అనుష్క శర్మని తాను పెళ్ళాడబోతున్నట్లు బీసీసీఐకి సమాచారమిచ్చాడట. అలా, అనుష్క శర్మని కోహ్లీ కుటుంబ సభ్యురాలిగా భావించి, కోహ్లీ, అనుష్కతో విదేశీ పర్యటనలకు వెళ్ళేందుకు బీసీసీఐ అనుమతిచ్చిందట.
ఫామ్‌లో వున్నప్పుడైతే ఇదేమీ అంత పెద్ద వివాదం అయ్యేది కాదేమో. ప్రస్తుతం వరుస వైఫల్యాలతో విలవిల్లాడుతున్నాడు కోహ్లీ. ఈ నేపథ్యంలో అతని ఆటతీరు పేలవంగా మారడానికి అనుష్క కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లాండ్‌కి పువ్వుల్లో పెట్టి అప్పగించేసింది టీమిండియా. ఆ వైఫల్యంలో కోహ్లీకీ బాధ్యత వుంది. దాంతో, అనుష్క – కోహ్లీ వ్యవహారంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
ఎలాగూ డేటింగ్ వ్యవహారం బయటపడింది గనుక, ఇప్పటికైనా కోహ్లీ, అనుష్క అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడిస్తే మంచిదేమో.! ఇక ఆట అంటారా.? కోహ్లీ అంటూ మళ్ళీ ఫామ్‌లోకొస్తే, అతని దూకుడుని ఆపడం ఎవరితరమూ కాదు.