మనసావాచాకర్మనా పెళ్లాడిన వ్యక్తి, తన కళ్లముందే మరో మహిళతో శృంగారం చేస్తుంటే ఏ భార్య సహిస్తుంది. వరలక్ష్మి కూడా సహించలేకపోయింది. కళ్ల ముందే కట్టుకున్న భర్త మరో అమ్మాయితో సెక్స్ చేస్తుంటే చూడలేకపోయింది. నిండు ప్రాణాలు బలితీసుకుంది. భార్యను మానసికంగా హింసించిన ఆ భర్త ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. విశాఖ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కొత్తూరుకు చెందిన వరలక్ష్మికి, అదే మండలానికి చెందిన చినరాజుతో వివాహం జరిగింది. వీళ్ల పెళ్లయి 8 ఏళ్లయినా సంతానం కలగలేదు. దీంతో వరలక్ష్మిని చిన్నచూపు చూడడం ప్రారంభించాడు చినరాజు. ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అత్తమామలు కూడా వరలక్ష్మిని ఈసడించుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో వరలక్ష్మిని వదిలేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు చినరాజు. భార్య ఎదురుగానే మరో మహిళతో క్లోజ్ గా ఉంటూ వేధించాడు. ఒక దశలో భార్య ముందే మరో మహిళను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి సెక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దీన్ని భరించలేని వరలక్ష్మి మేడపై నుంచి దూకేసింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
అయినా వరలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసినా చినరాజులో మార్పురాలేదు. తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో భరించలేకపోయిన వరలక్ష్మి ఈసారి ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు తన అక్కకు విషయం మొత్తం చెప్పింది వరలక్ష్మి. తన మృతికి భర్త, అత్త, భర్త ప్రియురాలే కారణమని అక్కతో చెప్పింది. వరలక్ష్మి అక్క ఫిర్యాదు మేరకు, ఆమె సమర్పించిన వాట్సాప్ సమాచారం ఆధారంగా చినరాజు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.