జడ్జ్గారూ.. మేమంతా భారతదేశ పౌరులం సార్..! మీ కోర్ట్ కెందుకొచ్చామంటే మా రాజకీయనాయకులు మా గురించి పట్టించుకోవటం లేద్సార్..
ఇది కన్జూమర్ కోర్టయ్యా.. ఇక్కడ వ్యాపార లావాదేవీలగురించే విచారిస్తాం..
రాజకీయాలు కూడా వ్యాపారమేనని ఈ మధ్య అనేకమంది ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, కార్పొ రేటర్లూ.. అందరూ ముక్తకంఠంతో స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్.. వాళ్ళు గత 70 ఏళ్ళుగా చేస్తోంది కూడా వ్యాపారమే.. కావాలంటే కమిటీ వేసుకుని చెక్ చేసుకోండి. ఎవరైనా బిల్డర్ గానీ మామూలు పౌరులు గానీ బిల్డింగ్ కట్టాలంటే కార్పోరేషన్‌తో పాటు ప్రజా ప్రతినిధుల పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కోసం లక్షలు వాళ్లకు ఫీజ్ కట్టాలి.. కాని రాజకీయాలు సమాజ సేవ అని ప్రభుత్వాలు అంటున్నాయ్ కదా..
అని మళ్ళీ టాక్స్‌లు కట్టించుకుంటున్నారు కద్సార్.. ఇప్పుడు వస్తోన్న మాటేమిటి? వ్యాపారమే కదా.. పైగా ప్రభుత్వాలు కూడా ఆ నాయకులకు ఇచ్చే లంచాలను తప్పు బట్టి వాళ్ళను డిస్మిస్ చేయడం గానీ అరెస్ట్ చేయడం గానీ చేయటం లేదుకదా.. అంటే వాళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నట్లే కదా.. అంటే ప్రభుత్వాధినేతలకు కూడా అందులో వాటాలు ఉన్నట్లే కదా..
ఓకే.. రాజకీయాలు వ్యాపారమే.. వప్పుకుంటున్నా.. అయితే ఇప్పుడేమంటారు?
వాళ్ళు ఇలా కలెక్ట్ చేస్తోన్న తమ ఫీజులు ఎప్పటినుంచో పెంచటం లేదండీ.. అందువల్ల మాకు అశాంతిగా వుంది..
పెంచకపోతే మీకే మంచిది కదా..
కాద్సార్.. పెంచకుండా దానికి మూడొంతులు మా కాలనీల కిచ్చే సదుపాయాలకోసం మా కాలనీల ప్రెసిడెంట్ లను డిమాండ్ చేస్తున్నారండీ.. అంటే మళ్ళీ మేమే రోడ్ల కోసం,మంచినీళ్ళ కోసం, డ్రైనేజ్ లైన్స్ కోసం, వాళ్లకు ఇన్ డైరెక్ట్ గా ఫీజులు కట్టాల్సి వస్తోంది.
అయితే ఏమంటారిప్పుడు?
గవర్నమెంట్ ఆ ఫీజులన్నీ లీగలైజ్ చేసి ఫీజులు ఫిక్స్ చేయాలిసార్.. అంటే మాకాలనీకి ఒక రోడ్ కావాలనుకోండి.. మా ప్రజా ప్రతినిధులందరికీ వేరువేరుగా లంచాలు ఇచ్చేబదులు అఫీషియల్‌గా కార్పొరేటర్‌కి మీటర్ రోడ్డుకీ పదివేల రూపాయలు.. అదే మీటర్ రోడ్డుకి ఎమ్మెల్యేకి అయిదు వేల రూపాయలు, ఎంపీకి రెండువేల రూపాయలూ, ఏమ్మేల్సీకి వెయ్యి రూపాయలూ చొప్పున ఫిక్స్ చెయ్యాలి సార్ .
అప్పుడు మేము ఆ ఫీజులన్నీ బాంక్ లో చలాన్ ద్వారా కట్టేస్తాం.అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మేము వాళ్ళందరి వాటాలూ చలాన్ ద్వారా కట్టేస్తాం.. దాంతో మాకు వాళ్ళు మైంటైన్ చేసే గూండాల బాధ తప్పిపోతుంది.
పాపం ఆ రెక్కాడితే గాని డొక్కాడని బీద నాయకులకు అంతంత పైసలిచ్చి గూండాలను మైంటైన్ చేయాల్సిన శ్రమ కూడా తప్పి పోతుంది.
కానీ లంచాలను అలా చలాన్ ద్వారా కట్టటానికి చట్టం వప్పుకోదు కదా..
చట్టాలను మార్చటం వాళ్ళ చేతుల్లోనే వుంది కద్సార్.. నిమషాల్లో మార్చేస్తారు.. వాళ్ళ స్వలాభం కోసం ఎన్ని చట్టాలను మార్చటం లేదు?
ఏమయ్యా ప్రభుత్వ లాయరూ? వాళ్ళ డిమాండ్ గురించి నువ్వేమంటావ్?
మేము, మా ప్రజా ప్రతినిధులూ చేసేది వ్యాపారమే అని వప్పుకుంటాం గాని మా ఫీజులు చలాన్ ద్వారా కట్టటానికి వప్పుకోం సార్..
ఎందుకని.. మీ లాభాలు మీకు వస్తాయ్ కదా.. అభ్యంతరమేమిటి?
కాష్ ఇస్తే మాకు టాక్స్ కట్టే పని వుండదు సార్.. చలాన్ ద్వారా కడితే అందులో మూడొంతులు ఇన్‌కంటాక్స్‌కే పోతుంది..
ఏమయ్యా కన్జూమరూ.. నువ్వేమంటావ్.. కాష్ ఎందుకు కట్టవ్?
బాంకులు కాష్ ఎక్కడ ఇస్తున్నయ్ సార్.. ఎప్పుడో దివాలా తీసినాయ్ కదా..
మరి ఈ ప్రాబ్లెం సాల్వ్ చేయటమెలా?
మేమొక అయిడియా ఇస్తాం సార్.. .. ఏంటది?
లాగానే.. 2 అని ఇంకో టాక్స్ కేవలం ప్రజా ప్రతినిధుల కోసం ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది సార్..
కానీ ఒకే పేరుతో రెండు రకాల టాక్స్ వసూలు చేయటం రాంగ్ కదా..
ఒకే పేరు కాద్సార్.. అంటే గుడ్స్ సర్విస్ టాక్స్ కదా.. 2 అంటే గూండాస్ సర్విస్ టాక్స్.. అలా వసూలు చేస్తే అప్పుడు వాళ్ళు ఇన్‌కం టాక్స్ కట్టే అవసరం వుండదు..
ఓకే.. కన్జూమర్స్ డిమాండ్‌తో మా కోర్ట్ ఏకీభవిస్తోంది.. ఇకనుంచీ కన్జూమర్స్ అన్నిరకాల లంచాలూ.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల లంచాలతో సహా.. ఆర్టీయే ఆఫీసులు లంచాలతో సహా.. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లంచాలనూ.. 2 పేరుతో కేవలం చలాన్ ద్వారానే కట్టాలని తీర్పు ఇస్తున్నాం.. అందుకు అవసరమైన చట్టాలను శాసన సభలు పాస్ చేయవలసిందిగా కోరుతున్నాం..
-యర్రంశెట్టి సాయి