శ్రుతి హాసన్.. వాట్ ఏ లాజిక్!

ఒకవైపు బాలీవుడ్ నెపిటిజం మీద తెగ చర్చ జరుగుతోంది. పవర్, ఇన్ ఫ్లుయన్స్ ఉన్న వాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయని కంగనా రనౌత్ లాంటి వాళ్లు మొత్తుకుంటున్నారు. కరణ్ జొహార్ లాంటి వాళ్లైతే తమకు సన్నిహితమైన…

ఒకవైపు బాలీవుడ్ నెపిటిజం మీద తెగ చర్చ జరుగుతోంది. పవర్, ఇన్ ఫ్లుయన్స్ ఉన్న వాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయని కంగనా రనౌత్ లాంటి వాళ్లు మొత్తుకుంటున్నారు. కరణ్ జొహార్ లాంటి వాళ్లైతే తమకు సన్నిహితమైన వారికే అవకాశాలు ఇస్తారని కూడా కంగనా వ్యాఖ్యానించింది. దానిపై పెద్ద దుమారమే రేగుతోంది. మరి ఆ సంగతలా ఉంటే.. సినీ వారసులకే అవకాశాలు దక్కుతాయి, అనే అంశంపై స్పందించింది శ్రుతి హాసన్.

మీలాంటి వాళ్లు నిలదొక్కుకోవడానికి కారణం సినీ వారసత్వమే కదా.. అని శ్రుతి హాసన్ దగ్గర అంటే, ఒక పెద్ద లాజిక్కే చెప్పింది. తన సక్సెస్ లో తల్లిదండ్రుల ప్రభావం లేదని శ్రుతి చెప్పుకొచ్చింది. కేవలం స్వశక్తితోనే ఎదిగినట్టు చెప్పింది. మరి కమల్ హాసన్ తనయగా తనకు కలిసి వచ్చిందేమీ లేదని చెప్పుకొచ్చింది. తను మాత్రమే కాదు సినీతారల పిల్లల సక్సెస్ ఏదైనా కూడా కేవలం వారి ప్రతిభ మీదే ఆధారపడిందంది.

కాయిన్ పైకేస్తే బొమ్మ అయినా పడొచ్చు, బొరుసు అయినా పడొచ్చు.. అలాగే సినీతారల పిల్లలు కూడా అంతే. వారు వచ్చి సక్సెస్ అయినా కావొచ్చు, ఫెయిల్యూర్ అయినా కావొచ్చు.. అని శ్రుతి చెప్పుకొచ్చింది. వినడానికి ఈ బొమ్మాబొరుసుల లాజిక్ బాగానే ఉంది కానీ, కెరీర్ ఆదిలో శ్రుతికి ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయి.

ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. మరి అయినప్పటికీ.. ఇండస్ట్రీలో తదుపరి అవకాశాల కోసం ఈమె ప్రయత్నించగలిగింది అంటే.. నిలదొక్కుకోవడానికి దానికి ఈమె కుటుంబ నేపథ్యం ఉపయోగపడలేదా? కమల్ తనయ కాకుండా.. వేరే అమ్మాయికి ఒకటీరెండు ప్లాఫ్ లు ఎదురైన తర్వాత అవకాశాలు దక్కుతాయా?