బాలయ్య కోసం మార్ఫింగ్ డిజైన్ లు

పెద్ద హీరో ల కోసం ప్రకటనలు రూపొందించినా, లేదా డిజైన్లు తయారుచేయించినా చాలా జాగ్రత్తగా వుంటారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. అందులో ఓ సినిమాకు సంబంధించి ఫస్ట్ టైమ్ పోస్టర్లు వేస్తున్నారంటే…

పెద్ద హీరో ల కోసం ప్రకటనలు రూపొందించినా, లేదా డిజైన్లు తయారుచేయించినా చాలా జాగ్రత్తగా వుంటారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. అందులో ఓ సినిమాకు సంబంధించి ఫస్ట్ టైమ్ పోస్టర్లు వేస్తున్నారంటే మరెంత జాగ్రత్త కావాలి. కానీ బాలయ్య 102వ సినిమా పోస్టర్లు చూసి అభిమానులు ఖంగుతిన్నారు.

బాలయ్య పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన 102వ సినిమా యూనిట్ శుభాకాంక్షల ప్రకటనలు విడుదలచేసింది. ఈ సినిమాకు దర్శకుడు కేఎస్ రామారావు. బాలయ్య లైన్ ఓకె చేసారు తప్ప, ప్రాజెక్టు ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా స్టార్ట్ కావాల్సి వుంది.

ఇలాంటపుడు బాలయ్య బర్త్ డే కు ప్రకటన ఇవ్వాలంటే, మంచి స్టిల్ చూసి ప్రింట్ చేస్తే పోయేది. కానీ అలా చేయలేదు. గతంలో బాలయ్య నటించిన సినిమాల్లోని స్టిల్స్ ను తీసుకుని, ఫేస్ లో డిజిటల్ గా కాస్త మార్పులు చేసి, కొత్త గెటప్ అనేలా వదిలారు. ఇది చూసి అభిమానులు అవాక్కయ్యారు. తమ హీరో ఫొటోలు ఇలా తయారుచేయడం ఏమిటి అని వారిలో వారు డిస్కషన్లు చేసుకుంటున్నారు.