అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కొత్త కార్యవర్గాన్ని(2014-2015) ప్రకటించింది.నాట్స్ కార్యనిర్వహక అధ్యక్షుడిగా గంగాధర్ దేసు ను నాట్స్ కమిటీ ఎన్నుకుంది.. న్యూజేర్సీలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గంగాధర్ దేసు.. నాట్స్ సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకైన పాత్ర పోషించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులను చూసి చలించిన గంగాధర్ దేసు.. అక్కడ నీటి శుద్ధి యంత్రాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపించారు. అటు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కూడా కిడ్నీబాధితులను ఆదుకునేందుకు గంగాధర్ దేసు ప్రత్యేక కృషి చేశారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా, వైఎస్ ప్రెసిడెంట్ గా అనేక కీలక పదవుల్లో కొనసాగుతున్న గంగాధర్ దేసు.. ఇక ముందు నాట్స్ ప్రెసిడెంట్ గా తన సత్తా చాటనున్నారు. ఈ సారి గంగాధర్ దేసు నాయకత్వంలో 2015లో లాస్ ఏంజిల్స్ లో తెలుగు సంబరాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఇంతకాలం ఎంతో సమర్థంగా నాట్స్ ను ముందుకు నడిపించిన రవి మాదాల స్థానంలో ఇప్పుడు గంగధార్ దేసు నాట్స్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నారు. నాట్స్ ప్రకటించిన నూతన కార్యవర్గం ఒక్కసారి పరిశీలిస్తే..
ప్రెసిడెంట్… దేసు గంగాధర్, వారెన్, న్యూ జెర్సీ
పాస్ట్ ప్రెసిడెంట్ .. రవి మాదాల,వెస్ట్ పాం బీచ్, ఫ్లోరిడా
వైస్ ప్రెసిడెంట్స్
1. అచంట రవి, చికాగో, ఇల్లినాయ్
2. మన్నవ మోహన కృష్ణ ,ఎడిసన్, న్యూ జెర్సీ
3. కోగంటి రామకృష్ణ, డాలస్, టెక్సాస్
4. కంఠమనేని కిషోర్, లాస్ ఏంజిల్స్, కేలిఫోర్నియా
కార్యదర్శి:సూరపనేని బసవేంద్ర, డెట్రాయిట్, మిచిగన్
సంయుక్త కార్యదర్శి: సాయిప్రభాకర్ యర్రాప్రగడ, ఓర్లాడో, ఫ్లోరిడా
కోశాధికారి: పాపుదేశి ప్రసాద్, లాస్ ఏంజిల్స్, కేలిఫోర్నియా
సంయుక్త కార్యదర్శి: మంచికలపూడి శ్రీనివాస్, సెయింట్ లూయిస్, ముస్సోరీ