ఆఫీస్ స్పేస్1,479కోట్లు, రికార్డు బ్రేక్ రేట్ల ముంబై

దేశ వాణిజ్య రాజ‌ధాని న‌గ‌రంలో వాణిజ్య స్థలం రికార్డు స్థాయిలో సేల్ అయింది. గోద్రెజ్ ప్రాప‌ర్టీస్‌కు చెందిన ఒక కార్యాల‌య భ‌వ‌న స‌ముదాయం… దేశంలోనే ఇంత‌కు ముందు ఎన్నడూ లేనంత‌ భారీ ధ‌ర ప‌ల‌కింది.…

దేశ వాణిజ్య రాజ‌ధాని న‌గ‌రంలో వాణిజ్య స్థలం రికార్డు స్థాయిలో సేల్ అయింది. గోద్రెజ్ ప్రాప‌ర్టీస్‌కు చెందిన ఒక కార్యాల‌య భ‌వ‌న స‌ముదాయం… దేశంలోనే ఇంత‌కు ముందు ఎన్నడూ లేనంత‌ భారీ ధ‌ర ప‌ల‌కింది. ముంబ‌యిలోని గోద్రెజ్ బాంద్రా కుల్రా కాంప్లెక్స్ లో ఉన్న ఈ క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్ట్ ని తాజాగా కొనుగోలు చేసిన ధ‌ర అక్షరాలా రూ.1479 కోట్లు. 

కొనుగోలు దారుడి పేరు, వివ‌రాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ క‌మ‌ర్షియ‌ల్ స్పేస్  అడుగుకు రూ.4,35ల‌క్షల ధ‌ర ప‌లికింది. మొత్తం 4,35,000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఇదే ధ‌ర మీద అమ్ముడై,  ఇప్పటిదాకా ఒక్క ఆఫీస్ స్పేస్ విక్రయ ధ‌ర‌కు సంబంధించి ఉన్న అన్ని పాత రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. వ్యక్తిగ‌త భ‌వ‌నాల ధ‌ర‌లో ఇప్పటికే సంచ‌ల‌నాలెన్నో న‌మోదు చేసిన ముంబ‌యి… ఆఫీస్ స్పేస్‌ల ధ‌ర‌ల్లోనూ త‌న స‌త్తా చాటుకుంది. 

గ‌త నెలలోనే ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఏరియాలో ఉన్న లింక‌న్ హౌజ్‌కు ప‌లికిన ధ‌ర‌ సైతం ఇదే విధంగా గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈ వ్యక్తిగ‌త నివాస భ‌వ‌నం… అక్షరాలా రూ.750 కోట్లకు అమ్ముడై, ఇప్పటిదాకా దేశంలోనే అత్యంత ఖ‌రీదైన వ్యక్తిగ‌త నివాస భ‌వ‌నపు లావాదేవీగా నిలిచింది. ఈ లింక‌న్ హౌజ్‌ని పూనెకు చెందిన పారిశ్రామిక వేత్త సైర‌స్ పూనావాలా కొనుగోలు చేశాడు. ఆయ‌న సెర‌మ్ ఇన్‌స్టిట్యూట్ పేరుతో పాముకాటు నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించే మందుల‌ను త‌యారు చేసే కంపెనీకి అధిప‌తి. 

లింక‌న్ హౌజ్ విక్రయానికి కొన్ని రోజుల ముందే… జరిపిన మ‌రో లావాదేవీలో ప్లష్ మ‌ల్‌బార్ హిల్స్‌లో ఉన్న జాటియా హౌజ్ కూడా ఇదే ర‌కంగా రికార్డు సృష్టించింది. ఈ ఇంటిని కుమార మంగ‌ళం బిర్లా రూ.425 కోట్లకు కొనడం సంచ‌ల‌నం అయింది. వ్యక్తిగ‌త నివాస భ‌వ‌నాల‌లో అప్పటికి అదే అగ్రగామి రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీ కాగా… దాన్ని లింక‌న్ హౌజ్ అధిగ‌మించింది.