మేషం: కొత్త కాంట్రాక్టులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికం…రావలసిన సొమ్ము సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. అప్పులు తీరి ఊరట చెందుతారు. ఆస్తుల విక్రయాలు సజావుగా సాగి కొంత సొమ్ము అందుకుంటారు. కుటుంబం… బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని కుటుంబప్రణాళిక రూపొందించుకుంటారు. ఆరోగ్యం…స్వల్ప రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు.. మరింత లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలు…విధి నిర్వహణపై మరింత శ్రద్ధ చూపి సమర్థతను చాటుకుంటారు.. కళాకారులకు కాస్త అనుకూల సమయమే. మహిళలకు ఆస్తి లాభ సూచనలు.. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృషభం: ఆత్మీయులు నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆర్థికం…ఇబ్బందులు అధిగమిస్తారు. అప్పులు కొంత మేర తీరతాయి. ఆస్తులు, షేర్ల విక్రయాలు మరింత లాభించి అదనపు ఆదాయం పొందుతారు. అయితే ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. కుటుంబం.. బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించు కుంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆరోగ్యం.. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారాలు… విస్తరణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. అయితే ప్రస్తుత తరుణంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగాలు…అంచనాల మేరకు విధుల్లో మార్పులు జరుగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలు గతం కంటే కొంత అనుకూలత కలిగి ఉంటారు. మహిళలు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం: చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆర్థికం…కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. రుణాలు కొంత వరకూ తీరతాయి. ఆస్తుల విక్రయాల ద్వారా మరింత ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబం… బంధువుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించు కుంటారు. శుభకార్యాలు నిర్వహించడంపై కుటుం బంలో చర్చిస్తారు. ఆరోగ్యం….కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు…అనుకున్న విధంగా లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులు సమకూ ర్చుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగాలు.. సంతోష కరమైన సమాచారం అందుతుంది. పైస్థాయి వారి సూచనలు పాటిస్తూ విధుల్లో దూసుకువెళతారు. పారి శ్రామికవేత్తలకు అంచనాలు నిజమై ఊరట చెందు తారు. మహిళలకు శుభవార్తలు.శివాష్టకం పఠించండి.
కర్కాటకం: కొద్దిపాటి చికాకులను సైతం అధిగమిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. ఆర్థికం.. అవసరాలకు సొమ్ము అందుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతారు. షేర్ల విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము అందుతుంది. కుటుంబం….అందర్నీ ఆకట్టుకుంటారు. సంతానం వివాహయత్నాలు కలసివస్తాయి. ఒక సమాచారం బంధువుల ద్వారా అంది సంతోషిస్తారు. ఆరోగ్యం.. స్వల్ప రుగ్మతలు బాధించినా లెక్కచేయరు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాల వారికి కార్యసిద్ధి. మహిళలకు శుభవార్తలు. దేవీస్తుతి మంచిది.
సింహం: శ్రమ మరింతగా పెరుగుతుంది. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మీపట్ల కొంత అనుకూల వైఖరి అనుసరించడం విశేషం. నిరుద్యోగులకు అంతగా అనుకూలం కాదు. ఆర్థికం…రావలసిన సొమ్ము ఆలస్యంగా అందినా అవసరాలు తీరతాయి. రుణాలు తీరే సూచనలు. సోదరుల నుంచి ధనప్రాప్తి. కుటుంబం… మీ అభివద్ధికి కుటుంబసభ్యులు చేయూతనందిస్తారు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం…కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలు… నూతన పెట్టుబడులకు మార్గం సులువవుతుంది. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలు… ఎదురైన ఒత్తిడులను అధిగమించి ముందుకు సాగుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. గణేశాష్టకం పఠించండి.
కన్య: మొదట్లో కొన్ని వివాదాలు నెలకొని చికాకు పరుస్తాయి. క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికం… ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. కుటుంబం…సంతానంలో ఒకరి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఇంటి నిర్మాణాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ఆరోగ్యం….కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు…. మరింత పుంజుకుంటాయి. భాగస్వాముల సహాయం మరింత అందుకుంటారు. ఉద్యోగాలు…విధులు అనుకున్న విధంగా సాగుతాయి. సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. కళాకా రులకు ప్రస్తుత పరిస్థితులు కొంత అనుకూలించి ఊరట చెందుతారు.. మహిళలకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. హనుమాన్ఛాలీసా పఠించండి.
తుల: కొన్ని కార్యక్రమాలు కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికం…ఇబ్బందులు తీరతాయి. రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు. స్థిరాస్తిపై పెట్టుబడులు పెడతారు. కుటుంబం….అందరి ప్రేమను పంచుకుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. విదేశాలలోని సంతానం ఆరోగ్యంపై ఊరట చెందుతారు. ఆరోగ్యం…కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. అయితే క్రమేపీ బయటపడతారు. వ్యాపారాలు..కొత్త భాగస్వాముల సహాయం స్వీకరిస్తారు. విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు…కోరుకున్న విధంగా మార్పులు జరుగుతాయి. పైస్థాయి వారి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవేత్తల యత్నాలు కొంత ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో కొన్ని సమస్యలు తీరతాయి.. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
వశ్చికం: భవిష్యత్తుపై మరింత భరోసా కలిగించే సమాచారం అందు తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమపడైనా పూర్తి చేస్తారు. రచనా, వ్యాసాంగాలపై ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. చిన్ననాటి మిత్రులను ఎట్టేకలకు కలుసుకుంటారు. ఆర్థికం…రాబడి ఆశాజ నకంగా ఉంటుంది. కొన్ని మొండిబాకీలు కూడా వసూ లవుతాయి. రుణబాధలు కొంత తీరతాయి. కుటుం బం.. శుభకార్యాలపై చర్చలు. సంతానం స్థిరత్వంపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆస్తుల కొనుగోలులో సోదరులు చేయూతనందిస్తారు. ఆరోగ్యం….స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు… మరింత అభివద్ధిపథంలో సాగుతాయి. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు….అనుకూల పరిస్థితి ఉంటుంది. యథావిధిగా విధులు నిర్వర్తిస్తారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దేక్క సూచనలున్నాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. కనకధారాస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత లభిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థికం.. ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేస్తారు. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబం.. పెద్దలు ఇచ్చే సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వివాహాది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. సంతానం నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆరోగ్యం….మరింత మెరుగుదల కనిపిస్తుంది. వైద్యసేవలు తగ్గిస్తారు. వ్యాపారాలు… కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహవంతంగా ఉంటాయి. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలు.. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ సమర్థతను నిరూపించుకునే సమయం.. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఉత్సాహం కలిగించే వార్త అందుతుంది. అంగారకస్తోత్రాలు పఠించండి.
మకరం: కొన్ని కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చి స్తారు. గహ నిర్మాణయత్నాలు చేపడతారు. ఆర్థికం…అప్రయత్నంగా కొంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరే సమయం. అయితే ఖర్చు లు కూడా పెరిగి కొంత హడావిడి చెందుతారు. కుటుంబం….భార్యాభర్తల మధ్య కలతలు తొలగుతా యి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడంతో అడుగు ముందుకు వేస్తారు. వేడుకల నిర్వహణను వాయిదా వేసుకుంటారు. సంతానపరంగా చికాకులు ఏర్పడినా ఓర్పుగా అధిగమిస్తారు. ఆరోగ్యం….ఇబ్బందులు తీర తాయి. స్వస్థత చేకూరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపా రాలు…భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలు.. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులకు అవకాశాలపై కొత్తఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసికప్రశాం తతలభిస్తుంది. విష్ణుసహస్రనామాలు పఠించండి.
కుంభం: మీ అభివద్ధిలో సన్నిహితులు సహాయపడతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. ఆర్థికం…గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికంది అవసరాలు తీరతాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. కుటుంబం…మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. సంతానం నుంచి ఒక సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం….స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు…అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భాగస్వాములు మీపైనే మొత్తం బాధ్యతలు ఉంచుతారు. ఉద్యోగాలు..విధుల్లో ప్రశంసలు, అభినందనలు అందుకుంటారు. పదిమంది పని మీమీదే వేసుకుని సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తల కషి కొంతమేర ఫలిస్తుంది. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సూర్యాష్టకం పఠించండి.
మీనం: అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థికం….కొంత సొమ్ము సకాలంలో అందుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగించుకుంటారు. షేర్ల విక్రయాలు సైతం పూర్తి చేసి మరింత ధనం పొందుతారు. కుటుంబం….మీపై ఉంచిన బాధ్యతలు పూర్తి చేసి అందరి ఆదరణ పొం దుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. సోదరులతో ఆస్తుల వ్యవహారాలపై వివాదాలు పరిష్క రించుకుంటారు. ఆరోగ్యం….శారీరక రుగ్మతలు తొల గుతాయి. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలు… లాభాల దిశగా సాగుతాయి. పెట్టుబడులు అందు కుంటారు. ఉద్యోగాలు…కొన్ని ెదాలు అప్రయత్నం గా దక్కుతాయి. కళాకా రులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. మహిళలకు ఆకస్మిక ధనలాభం. లక్ష్మీనసింహస్తోత్రాలు పఠించండి.
Vakkantham Chandra Mouli
www.janmakundali.com