సెటైర్: చంద్రబాబు టెక్నోపాఖ్యానం!

‘‘మన సెందరబాబు గారు.. ఇయ్యాల భగవద్గీతలో పరమాత్ముడి మాదిరిగా శానా గొప్ప జీవితసత్యాల్ని చెప్పేశాడ్రా’’ Advertisement ‘‘ఏం చెప్పాడేంటి… 2018 నాటికి పోలవరాన్ని, 2019 నాటికి అమరావతి రెడీ చేసేస్తానన్నాడా ఏంటీ…’’ ‘‘అఫ్ కోర్సు..…

‘‘మన సెందరబాబు గారు.. ఇయ్యాల భగవద్గీతలో పరమాత్ముడి మాదిరిగా శానా గొప్ప జీవితసత్యాల్ని చెప్పేశాడ్రా’’

‘‘ఏం చెప్పాడేంటి… 2018 నాటికి పోలవరాన్ని, 2019 నాటికి అమరావతి రెడీ చేసేస్తానన్నాడా ఏంటీ…’’

‘‘అఫ్ కోర్సు.. ఆయన మాటల్లో అయి గూడా నిత్యసత్యాలే అనుకో.. కానీ.. మనుసులకి సంబంధించి గొప్ప డైలాగు ఓటి వదిలాడ్రా’’

‘‘సొంత డైలాగేనా.. సినిమా వోళ్లతో రాయించారా’’

‘‘సెంద్రబాబును శానా తక్కువ లెక్కేస్తన్నావొరేయ్.. ఆయన్ని మించి పంచ్ డైలాగులు రాసేటోళ్లు సినీమాల్లో ఎక్కడుంటర్రా…’’

‘‘మరీ అంత బజనా బావా’’

‘‘బజన కాదెహె.. ఆ మద్దెన అందురూ ముగ్గురు బిడ్డల్ని కనాలని సెలవిచ్చాడా.. ఇయ్యాల మొగుడూ పెళ్లాల డైవోర్సు ఎలా వొస్తన్నాయో మర్మం చెప్పడ్రా…’’

‘‘ఏటంటాడేటి..’’

‘‘టెక్నాలజీ మీద ఓవర్ గా ఎగబడిపోవడం.. సంసారాల్ని కూల్చేస్తా ఉన్నదంట. రాత్రి మొగుడూ పెళ్లాలు పడుకున్నాక.. మొగుడో ఫోను, పెళ్లామో ఫోను చూసుకుంటా ఉంటారంట. నెమ్మదిగా అవి డైవోర్సుదాకా యెల్తన్నాయంట’’

‘‘నిజమే గదా’’

‘‘అదే మరి.. టెక్నాలజీ మంచిదే గానీ.. డోసు ను మించి దాని మీద మోజు పడితే మొదటికే మోసం వస్తుందీ… అని సెలవస్తన్నారు పెద్దాయన’’

‘‘నాకో డౌటు కొడ్తాంది బావా’’

‘‘ఏటి చెప్పరా..’’

‘‘ఓవరుగా డిపెండయిపోవడమంటే.. పోలవరం ప్రాజెక్టును సమీక్షించడానికి .. పనుల దగ్గరకి పోకుండా.. డాష్ బోర్డు ముందర గూచోని.. డ్రోన్ కెమెరాల్లోంచి చూసేయడమేనంటావా’’

‘‘అద్గదీ మాట.. అదన్నమాట టెక్నాలజీ వాడడం అంటే’’

‘‘కాదు బావా.. అది ఓవర్ డోసు. ఎందుకంటే.. పనుల దగ్గరకి వెళ్లి తనిఖీ చేయాల్సినోళ్లు డ్రోన్ కెమెరాల్లోంచి చూసి.. రైట్ రైట్ అనేస్తుండబట్టే.. అక్కడ కాంక్రీటు పనుల్లో అప్పుడే పగుళ్లు వచ్చేస్తన్నాయంట… మరి టెక్నాలజీ డోసుపెరిగి డేమేజీ అయినట్టా కాదా?’’

‘‘నిజమేనొరేయ్.. ఎంతైనా సరే.. సెంద్రబాబు సెప్పింది మాత్రం అచ్చమైన జీవితసత్యమే. కాపోతే.. ఆయనకి దాన్ని పాటించడం మాత్రం తెలీదంతే…’’

‘‘సరిగ్గా పాయింటు పట్టుకున్నావ్ బావా.. నీలాటోడికి టెక్నాలజీ కూడా దండగే.‘‘

‘‘ఊరుకోరా.. పొగడ్తాంటే సిగ్గేస్తాంది…’’