నమస్తే బాలకృష్ణ గారూ..
ఆ.. ఆ.. ఓకే.. ఓకే.. ఎవరునువ్వు.. ఏమ్కావాలి?
నేను జర్నలిస్ట్‌ని సార్.
ఆ విషయం నీ మొఖం చూస్తేనే తెలుస్తోంది.. నేనడిగేది అదికాదు.
మరేంటి సార్ ?
ఏ పార్టీ వాడివి? టీడీపీ వాడివా? కాంగ్రెస్ వాడివా?
నేను ఆ టైప్ జర్నలిస్ట్‌ని కాదు సార్.. పార్టీలెస్ జర్నలిస్ట్‌ని.
అలాంటి వాళ్ళు ఇండియాలో ఉంటారా?
చాలామంది ఉన్నారు సార్. అరుణ్ శౌరీ, కులదీప్ నయ్యర్, గురుమూర్తీ.
ఆగాగు.. వాళ్ళ పేర్లేప్పుడూ వినలేదే.. ఏమేం సినిమాలకు వర్క్ చేసారు వాళ్ళు?
వాళ్ళు సినిమా జర్నలిస్ట్‌లు కాద్సార్.
వాట్? సినిమాలకు కాక వేరే రకం జర్నలిస్ట్‌లు కూడా ఉంటారా?
ఉంటారు సార్..
ఇండియా అంటే కిష్నా జిల్లా యే కదా?మరి వాళ్ళునన్నెప్పుడూ కలుసుకోలేదే. రేపు నా షూటింగ్ స్పాట్‌కి రమ్మను పొడ్యూసర్తో చెప్పి 500 కన్వేయన్స్ ఇప్పిస్తా.
వాళ్ళ సంగతి వదిలేద్దాం సార్.
సరే.. ఇంతకూ నువ్వే పార్టీ అన్నావ్? కాంగ్రెస్సా? వైయస్సార్ పార్టీయా? మా టీడీపీయా?
నాకు పార్టీ లేద్సార్.
అదేంటి? పార్టీ లేకుండా కూడా జర్నలిస్టులు ఎలా ఉంటారో నాకు అర్ధం కావటం లేదు.
చాలా మంది ఉంటారు సార్.. అసలు ఏ పార్టీకీ చెందని వాళ్ళే రియల్ జర్నలిస్ట్స్ సార్.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావటంలా.
ఆ విషయం వదిలేయండి సార్.. ఈ మధ్య మీ టీడీపీ మినిస్టర్ కొంతమంది ఎమ్మెల్యేలూ కాల్‌మనీ రాకెట్లో ఇరుక్కున్నారు కదా.. మరి…
ఇరుక్కోవటమేమిటి? ఎక్కడ ఇరుక్కున్నారు? అసలు ఇరుక్కున్నారని ఎవరన్నారు?
అదే.. చానల్ వాళ్ళూ, ప్రింట్ మీడియా వాళ్ళూ.
ఇదిగో.. చూడు.. మా పార్టీవాళ్ళు ఇంతవరకూ ఎప్పుడూ ఎక్కడా ఇరుక్కోవటం అనేది జరగలేదు.. జరగదు.. కాల్ మనీ ఉదాహరణ చూసావ్ కదా.. ఎవడు ఏం పీకాడు?
కానీ మొన్న మీ మినిస్టర్ గారి కొడుకు ఆ ముస్లిం లేడీ గొడవలో జైలు కెళ్ళాడు గద్సార్?
అది తెలంగాణాలో జరిగింది గనుక వెళ్లాడు.. ఆ గొడవ మా స్టేట్‌లో జరిగిఉంటే వెళ్లేవాడా? నేను మర్డర్ కేస్‌లో ఇరుక్కున్నానని ఖచ్చితంగా జైలు కెళ్తానని అందరూ అనుకున్నారు.. ఏమయింది? వెళ్ళానా?
అప్పుడు మీ సిస్టర్ పురందేస్వరీ రాజశేఖర రెడ్డీ కలసి ఆ కేస్‌ని రుణమాఫీ చేసేసారు సార్.
అవునా అంటే దానర్ధం ఏమిటి? మా ఫ్యామిలీ విషయానికొస్తే కాంగ్రెస్ టీడీపీ కూడా కలసి పోతాయ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ మా ఫ్యామిలీ చేతుల్లో ఉండాల్సిందే.. ఇప్పుడు చూడు కేవలం మా ఫ్యామిలీని కాపాడటం కోసం మా సిస్టర్ తనకు మంత్రి పదవి ఇచ్చిన సోనియా మేడంని కూడా ఒక్క లాత్ కొట్టి బీజేపీలోకి దూకేసింది.. రేపో మాపో సెంట్రల్ మినిస్టర్ కూడా అయిపోతుంది.
అందులో ఆశ్చర్యం ఏమీ లేద్సార్.. కానీ ఇప్పుడు నేను వచ్చింది మీ ఫ్యామిలీ హిస్టరీ తెలుసు కోవటానికి కాద్సార్.
ఓ.. అర్ధమయింది.. నా నెక్స్ట్ పిక్చర్ గురించి తెలుసుకోడానికి వచ్చి ఉంటావ్.. జస్ట్ నౌ టైటిల్ డిసైడ్చేశా.. రేప్ నీదే..ఎలా ఉంది.. మాస్ టైటిల్ కదూ?
నేను వచ్చింది అది మాట్లాడ డానికే సార్. మీరు మొన్నొక రోజు మాట్లాడుతూ అమ్మాయిలను కిస్ చేయాలి. లేకపోతే రేప్ చేయాలి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు కదా.. అందుకు మిమ్మల్ని నిర్భయా చట్టం కింద బుక్ చేయాల్సి ఉంటుంది కదా?
కదా? దమ్ముంటే బుక్ చేయమను.. మహా మహా మర్డర్ కేసుల్లోనే ఎవడూ పీకలేక పోయాడు.. ఇప్పుడు ఏం పీకుతారు.. టీడీపీ వాళ్ళ మీద కేస్లు ఉండవ్.. మా సుజనా చౌదరి.. మా విజయ రామారావ్ బ్యాంకు ఫ్రాడ్ గురించి ఇంతవరకూ ఎవర్నైనా అరెస్ట్ చేసారా?
ఆ సంగతి వదిలేయండి.
అవును.. అన్నీ వదిలేస్తేనే రాజకీయాల్లోకి రావాలి.. నాకు తెలుసు.
ఇంతకూ నేను వచ్చిన కారణం ఏమిటంటే ఆ రోజు మీరిచ్చిన స్టేట్ మెంట్ గురించి మాట్లాడడానికి. ఆ స్టేట్ మెంట్ ఇవ్వటం క్రైమ్ అని అందరూ అంటున్నారు కదా.. ఈ నేపధ్యంలో మీ స్టేట్ మెంట్ని మార్చే ఆలోచన ఉందా?
అందరూ కావాలంటే మారుస్తా.. నాదేం పోయింది..
అయితే ఇప్పుడేమంటారు?
రోడ్ మీద రేప్ చేయవద్దు.. కిడ్నాప్ చేసి రేప్ చేయండి.. ఇప్పుడెలా ఉంది?
ఇంకా దారుణంగా ఉంది.
అందుకే నేను జనరల్‌గా స్టేట్ మెంట్స్ ఇవ్వను.. ఈ సినిమాల వల్ల అన్నీ ఇలాంటి డైలాగ్సే వస్తాయ్.
కానీ ఇలాంటి చిల్లర్ డైలాగ్స్ వల్ల మీఫాన్స్ గొడవ చేస్తారు కదా.
ఏమీ చేయరు.. వొమన్ ఆర్గనైజేషన్ వాళ్ళే నోరు మూసుక్కూచున్నారు.. అదీ మన లెవల్.. అర్ధమయిందా..
కాని మీ లేడీ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. పైగా వొమన్స్ డే టైమ్‌లోనే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం.
అయితే మార్చేద్దాం.. వొమెన్ని ఎంకరేజ్ చేద్దాం.. స్టేట్మెంట్ ఇలా ఇస్తే ఎలా ఉంటుందో చూడు.. అమ్మాయిలందరూ మగాళ్ళను కిస్ చేయండి. లేదా రేప్ చేయండి. ఇప్పుడెలా ఉంది?
నాకు మెంటల్ వచ్చేస్తోంది.
హలో.. ఎక్కడికి.. సడెన్‌గా వెళ్ళిపోతున్నావ్?.. హలో.. వన్ మినిట్.. నచ్చకపోతే.. అసలు లేడీస్‌ని వదిలేద్దాం. మగాళ్ళందరూ మగాళ్ళను కిస్ చేయండి. లేదా రేప్ చేసేయండి. ఇప్పుడెలా ఉంది? హలో.. ఆగరా.. నిన్నే.. ఒరేయ్..
యర్రంశెట్టి సాయి.