సెక్స్ లో అమితంగా ఆనందించాలని అనుకుంటున్నారా.. దీని కోసం జిమ్ కు వెళ్లడమో, సెక్సీ అండర్ వేర్లు కొనడమో కాదు.. వీలైనంతగా నైస్ పర్సన్ అనిపించుకోండి, పొరుగు వారికి సహాయపడండి.. అప్పుడు శృంగారాన్ని తనివితీరా ఆస్వాధించనూ గలరు, తద్వారా పార్టనర్ తో ఆనందాన్ని పంచుకోగలరు.. అని అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. ప్రత్యేకించి మగవాళ్ల విషయంలో వారు ఈ ఆసక్తికరమైన పరిశోధనా వివరాలను వెళ్లడించారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయన వివరాలు ఇలా ఉన్నాయి. మగాడిని బెడ్రూమ్ లో సక్సెస్ ఫుల్ గా నిలపడానికి.. అతడి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అది కూడా పొరుగువారికి సాయపడటం విషయంలో ఆలోచనా దృక్పథానికి లైంగిక చర్యకు సంబంధం ఉంటుందట. కొన్ని వందలమంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్టుగా ప్రకటించారు అధ్యయన కర్తలు. వారి సెక్స్ వల్ హిస్టరీకి, వారు ఎలాంటి వారు? అనే అంశానికి రిలేషన్ ఉందని వీరు తెలిపారు.
యూరప్ పరిస్థితుల ప్రకారం చూస్తే సాయం చేసే మనస్తత్వం ఉన్న వారికి ఎక్కువమంది శృంగార బాగస్వామ్యులు కూడా ఉంటారని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు. మరి ఎదుటి వారి సహాయం చేసే మనస్తత్వం ఉంటే చక్కటి శృంగారానుభవం బోనస్ గా రావడం జరుగుతుంది, అదే సహాయం చేసే మనసత్వం లేకపోతే సదరు వ్యక్తుల శృంగార జీవితంలో అంత అహ్లాదకరమైన అనుభవాలు లేకపోవడాన్ని కూడా గమనించామని అధ్యయనకర్తలు వివరించారు. తద్వారా రసానుభూతితో కూడిన శృంగార జీవితాన్ని కోరుకునే వారు ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని వీరు స్పష్టం చేస్తున్నారు.
మరి మానవసేవే మాధవసేవ.. ఎదుటి వారికి సహాయం చేయాలి.. అనేది కేవలం జ్ఞానబోధ మాత్రమే కాదు.. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనేది..కేవలం అవసరార్థుల కోసం చెప్పిన మాట కాదు.. ఇది వ్యక్తుల శృంగార జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది.. అంటున్నారంటే, సహాయం చేయడం అనేది ఎంత గొప్ప పనో అర్థం చేసుకోవాలనమాట!