దివినుండి భువికి ఒక దేవకన్య దిగివచ్చింది

సిరి “మల్లి” పువ్వా, సిరిమల్లె పువ్వా అని పరిమళించింది  పదహారేళ్ళ పరువంలో దేవతేమో అని భ్రమ తెచ్చింది  “దేవత” లాగ నటించి, దేవత అయి నింగి కెగసింది “అనురాగ దేవత” వై తెలుగు వారికి…

సిరి “మల్లి” పువ్వా, సిరిమల్లె పువ్వా అని పరిమళించింది 
పదహారేళ్ళ పరువంలో దేవతేమో అని భ్రమ తెచ్చింది 
“దేవత” లాగ నటించి, దేవత అయి నింగి కెగసింది
“అనురాగ దేవత” వై తెలుగు వారికి అనురాగం పంచిన ఓ “రూప”
అభిమానవతవై “ఆకలి రాజ్యాని “కె  ఆకలిని మరపించిన శ్రీ “దేవి” 

కధగా కల్పనగా కనిపించావు మాకొక పసిపిల్ల “భాగ్యలక్ష్మి” లా తెలుగు వారి మదిలో “వసంత” రాగాలు ఆలపించిన “కోకిల”లా సరిలేరు నీ కెవ్వరు సాటిరారు తన కెవ్వరు ఈ జగాన

“జగదేకవీరులను” చిత్తు చేసింది నటనలో మా “అతిలోక సుందరి”
చందమామను మరపించిన నీ అందం అయింది ఒక “చాందిని “
నవరస నటనలో ప్రపంచ స్థాయికి ఎదిగింది ఈ హాసిని
తెలుగు వారి కనులలో కరిగిపోనీ కలల సాగరంలా 
మా హృదయాలలో నిను మేము ఎన్నడూ వీడని నీడలా 
నీ రూప, నటనలు మా పెదవులపై తరిగిపోని చిరునవ్వుల లా 
ఉవ్వెత్హునా ఎగిసే కడలి తరంగాలలో అలసిపోని అలలా 
దేవకన్యలు కరువై, ఇంద్రలోకాలకు తరలిపోయిన ఓ “ఇంద్రజా”!
తెలుగు వారి గుండెలు బద్దలు చేసిన ఓ “వయ్యారి భామ”
“క్షణం క్షణం” నిన్ను మరవని నీ తెలుగు ప్రజల మదిని జారే 

మా- కన్నీటి వీడ్కోలు…

-sam koushik katapati