స్విమ్మింగ్‌ పూల్‌లో సునామీ

రిక్టర్‌ స్కేల్‌పై 7.9 పాయింట్ల తీవ్రతతో వచ్చిన తుపాను దెబ్బకి నేపాల్‌ అతలాకుతలమైంది. అసలు భూకంపాలు ఎలా వస్తాయి.? వస్తే, ఆ సమయంలో పరిస్థితులు ఎలా వుంటాయి.? అన్నది నిన్న మొన్నటిదాకా చాలామందికి తెలిసేది…

రిక్టర్‌ స్కేల్‌పై 7.9 పాయింట్ల తీవ్రతతో వచ్చిన తుపాను దెబ్బకి నేపాల్‌ అతలాకుతలమైంది. అసలు భూకంపాలు ఎలా వస్తాయి.? వస్తే, ఆ సమయంలో పరిస్థితులు ఎలా వుంటాయి.? అన్నది నిన్న మొన్నటిదాకా చాలామందికి తెలిసేది కాదు. క్షణాల్లో విధ్వంసం.. ఆ తర్వాత చూస్తే ఏమీ మిగలదు. ఇదీ ఒకనాటి పరిస్థితి. ఇప్పుడలా కాదు. ఆ సమయంలో ఏం జరిగిందో క్షణాల్లో ప్రపంచమంతా పాకేస్తోంది.

Click Here For Video

నేపాల్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఓ స్విమ్మింగ్‌ పూల్‌లో నీరు వున్నపళంగా తీవ్రమైన కుదుపునకు గురై, కెరటాలు ఉత్పన్నమై, ఆ స్విమ్మింగ్‌ పూల్‌ లోంచి బయటకు దూసుకొచ్చిన ఆ వీడియో చూస్తే ఎవరైనా భయకంపితులవ్వాల్సిందే. సునామీ ఇలానే వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

భూకంపం వచ్చిన ప్రాంతంలో స్విమ్మింగ్‌ పూల్‌ వుంటే, అందులో నీటి పరిస్థితే ఇలా వుంటే, సముద్రంలో భూకంపం వస్తే ఆ పరిస్థితి ఎలా వుంటుంది.? ఇంకెలా వుంటుంది, 2004 నాటి ‘సమత్రా’ సునామీలా వుంటుంది. జపాన్‌ని మొన్నీమధ్యనే కుదిపేసిన సునామీని తలపిస్తుంది. జపాన్‌ సునామీ వీడియోల రూపంలో అందరికీ కన్పిస్తోంది. దాన్ని మించి నేపాల్‌ ‘స్విమ్మింగ్‌ పూల్‌ సునామీ’ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది.