ఎన్నింటినో లాజికల్ గా చూసే జనాలు కూడా పొగడ్తలకు ఈజీగా పడిపోతారు! అవతలవారు నిజంగానే పొగుడుతున్నారా, కావాలని పొగుడుతున్నారా.. అని తేల్చుకోవడం అందరికీ తేలికయ్యే అంశం కాదు. ఇక ఇవే పొగడ్తలు లైంగికాకర్షణ విషయానికి వస్తే కవితలవుతాయి!
ఇష్టమైన అమ్మాయికి సంబంధించిన ఫీలింగ్స్ ను కవితలుగా మార్చడం అబ్బాయిలకు చాలా తేలిక! ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కాళిదాసైపోగలరు. కాస్తో కూస్తో భాష కూడా వచ్చిన వాళ్లైతే.. ప్రేమ కావ్యాలనే రాసేయగలరు. మరి ప్రతి ఒక్కరూ ఆ రేంజ్ లో కలానికి పదును పెట్టలేరు. అయితే .. మగువకు మత్తెక్కించేలా మాట్లాడటం మాత్రం మరీ కష్టమైన పని కాదంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్.
ప్రత్యేకించి శృంగారం వరకూ వచ్చిన బంధంలో మగువను మత్తెక్కించగలిగేలా మాట్లాడటం గురించి వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. అవేమిటంటే!
నిన్ను కిస్ చేయడం ధన్యం!
నిన్ను ముద్దు పెట్టుకుంటే తరుణం నా జన్మకు ధన్యం.. అనే టోన్ ను ఎక్స్ ప్రెస్ చేస్తూ తనను పెదాలతో స్పృశించడం గురించి వివరించి చెప్పడాన్ని స్త్రీ బాగా ఎంజాయ్ చేస్తుందట! ముద్దు మాత్రమే కాదు, ముద్దు పెట్టుకోవడం ఎంత ఇష్టమో వివరించి చెప్పడం కూడా మత్తెక్కించే మాటేనట!
నీ స్మెల్ నన్ను మైమరపిస్తుంది!
ప్రతి మనిషీ నుంచి ఒకరకమైన స్మెల్ వస్తుంది. దాన్ని తను గుర్తించలేకపోవచ్చు కానీ.. పక్కనున్న వారు గుర్తిస్తారు. మనిషి వెదజల్లే ఆ పరిమళం వెనుక వారు వాడే సబ్బులు ఉండవచ్చు, వారు కొట్టుకునే స్ప్రే పని చేస్తూ ఉండవచ్చు. శృంగారపరమైన ఆకర్షణ ఉన్నప్పుడు ఈ స్మెల్ మరింత మధురమైన భావనను ఇస్తుంది. చాలా జ్ఞాపకాల్లో ఇలాంటి సుగంధం సువాసనల ప్రమేయం ఉంటుంది. సరిగ్గా ఈ అంశాన్ని గుర్తించి స్త్రీ నుంచి వెదజల్లే సువాసనను ఆస్వాధిస్తూ అదే విషయాన్ని ఆమెకు చెబితే ఆ ఫీలింగ్ రెట్టింపు స్థాయికి వెళ్లవచ్చు!
ఆమెలోని సౌందర్యం గురించి చెప్పడం!
అందం విషయాన్ని పక్కన పెడితే ఒక్కోరిలో శారీరక సౌష్టవానికి సంబంధించిన ప్రత్యేకతా ఉంటుంది. వారి శారీరక సౌష్టవంలో బాగా ఆకట్టుకునే అంశం గురించి చెప్పడం వారిని మరింత ఉత్సాహాన్ని, సెక్సీ మూడ్ ను అందించే అంశమే!
త్వరగా ఆన్ అయ్యేలా చేస్తావ్!
నిన్ను చూడగానే నన్ను నేను ఆపుకోవడం కష్టమనే విషయాన్ని ఆమెకు తెలియజెప్పడం కూడా గొప్ప విషయమే. ఈ ఫీలింగ్ ను లేడీ కి తెలియజెప్పగలగడం కూడా ఒక మధురానుభవమే!
డ్రస్సింగ్ ను ప్రశంసించడం!
చీరలో తను ఎంత అందంగా ఉంటుందో, చీర జారవిడిస్తే తను మరే లోకానికి తీసుకెళ్తుందో చెబితే వినడానికి తను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండవచ్చు! చీరతో మొదలుపెడితే.. వస్త్రాలకు సంబంధించిన వర్ణన కూడా మగాడి మాటల ప్రతిభకు ఆమె పెట్టే పరీక్షలాంటిదే!