తోటకూర కట్ట పది రూపాయిలు

ఉత్తరాంధ్ర నార్మల్ స్థితికి వచ్చేవరకు విశాఖను వీడను అన్న చంద్రబాబు వెనక్కు వచ్చేసారు. ఆయన వున్నన్ని రోజులు కూరగాయలు మంచివో, చెడ్డవో కాస్త తక్కువ ధరలకు ఇచ్చారు. గంటల కోద్దీ లైన్లో నిల్చున్నా, జనం…

ఉత్తరాంధ్ర నార్మల్ స్థితికి వచ్చేవరకు విశాఖను వీడను అన్న చంద్రబాబు వెనక్కు వచ్చేసారు. ఆయన వున్నన్ని రోజులు కూరగాయలు మంచివో, చెడ్డవో కాస్త తక్కువ ధరలకు ఇచ్చారు. గంటల కోద్దీ లైన్లో నిల్చున్నా, జనం కొనుక్కున్నారు. బాబు విశాఖ వదిలేసారు. ఇప్పుడు సీన్ రివర్సయింది. కూరగాయల ధరలు భయంకరమైన రేట్లకు పెరిగిపోయాయి. విశాఖలో ఏ ఆకుకూర అయినా చిన్న కట్ట 10 రూపాయిలకు తక్కువ లేదు. 

గతంలో ఇదే కట్టలు అయిదారు కలిపి పది రూపాయిలకు అమ్మేవారు. వర్షాలకు, గాలివానలకు కూరగాయలు, ఆకుకూరల పంటలన్నీ పోయాయని, అందువల్ల మార్కెట్ లకి సరుకు రావడం తగ్గిపోయిందని తెలుస్తోంది. అందుకోసం పంటలను పోని దూర ప్రాంతాల నుంచి, దక్షిణ కోస్తా జిల్లాల నుంచి సరుకు తెప్పించి, అమ్ముతున్నట్లు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు అన్ని ఖర్చలు కలిపి, ఆకాశానికి చేరిపోయాయి. బాబు ఈ వైనం గుర్తించి, మళ్లీ సబ్సిడీ ధరలపై కూరగాయలు అమ్మే ఏర్పాటు చేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు.