వారసత్వ నగరంగా అమరావతి

గుంటూరు జిల్లాలోని అమరావతిని కేంద్రం వారసత్వ నగరంగా ప్రకటించింది. దేశంలోని 12 నగరాల్ని వారసత్వ నగరాలుగా కేంద్రం ప్రకటించగా, అందులో గుంటూరు జిల్లాలోని అమరావతికి చోటు లభించడం విశేషమే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి…

గుంటూరు జిల్లాలోని అమరావతిని కేంద్రం వారసత్వ నగరంగా ప్రకటించింది. దేశంలోని 12 నగరాల్ని వారసత్వ నగరాలుగా కేంద్రం ప్రకటించగా, అందులో గుంటూరు జిల్లాలోని అమరావతికి చోటు లభించడం విశేషమే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకి ఫోన్‌ ద్వారా వెల్లడించారు.

అమరావతి వారసత్వ నగరంగా ఎంపిక కావడం గొప్ప విషయమంటున్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మితం కానున్న గుంటూరు జిల్లాకి ఇదో అరుదైన గౌరవంగా భావించవచ్చు. ఇక, అమరావతికి చారిత్రక నేపథ్యం వుంది. బౌద్ధమతం ఇక్కడ ఒకప్పుడు విలసిల్లింది. ఇప్పటికీ బౌద్ధమత ఆనవాళ్ళు గుంటూరు జిల్లాకి చారిత్రక సంపదగా ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. పవిత్ర అమరారామం గుంటూరు జిల్లాలోనే వుంది. పంచారామాల్లో అమరారామం ఒకటి.

వారసత్వ నగరం హోదా దక్కడంతో అమరావతి పర్యాటక ప్రాంతంగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం వుంది. ఆ దిశగా నిధుల కేటాయింపులోనూ కేంద్రం ఉదారత చూపితే, అమరావతి దశ తిరిగినట్లే.