అఖిల్ కు ఆలియా నో చెప్పిందా?

తెలుగులో చేయాలని వుంది…అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ భామ ఆలియా భట్. అలా అని మళ్లీ ఎవరు అడిగానా, ఏదో కారణం చెప్పి తప్పించుకుంటోంది. ఇప్పుడు తాజగా అఖిల్ సినిమా…

తెలుగులో చేయాలని వుంది…అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ భామ ఆలియా భట్. అలా అని మళ్లీ ఎవరు అడిగానా, ఏదో కారణం చెప్పి తప్పించుకుంటోంది. ఇప్పుడు తాజగా అఖిల్ సినిమా కోసం అడిగినా అదే ఆన్సర్ వచ్చిందని తెలుస్తోంది. 

వినాయక్ దర్శకత్వంలో, హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ తొలి సినిమాకు ఇప్పుడు హీరోయిన్ వేట సాగుతోంది. బాలీవుడ్ అమ్మడిని ఎవర్నైనా తెలుగులోకి దించాలని చూస్తున్నారు. సరైన వాళ్లు ఎవరూ ఇంకా సెట్ కాలేదు. 

ఆలియా అయితే మాంచి జోడీ అవుతుందనుకున్నారు. కానీ అదీ ఇంకా సెట్ కాలేదు. ఎవరు ఓకె అవుతారో అఖిల్ పక్కన జోడీగా..వెయిట్ అండ్ సీ.