వీరమాచనేని రామకృష్ణ ప్రతిపాదిస్తున్న డైట్ కు ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం తమ గుర్తింపును ఇచ్చింది. ‘వీఆర్కే డైట్- ఇండియా’ను గుర్తిస్తూ.. వీరమాచనేని రామకృష్ణకు ‘ఆంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత చాంక్జింగ్ హైజియా కాన్సర్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ అరుదైన సత్కారాన్ని వీరమాచనేని రామకృష్ణకు ప్రదానం చేసింది. చైనాకు వెళ్లి ఈ సత్కారాన్ని పొందారు వీరమాచనేని. ఈ అంశంపై చైనాలో రీసెర్చ్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సంపత్ వివరిస్తూ…
చాంక్జింగ్ వైద్య పరిశోధన కేంద్రంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిపాదనలో ఉన్న వివిధ డైట్స్ పై పరిశోధన సాగుతుందని, అలా వీఆర్కే డైట్ పై కూడా పరిశోధన జరిగిందని తెలిపారు. ‘డైట్స్ విషయంలో వివిధ వైద్య విభాగాల్లో ఏడెనిమిది డిపార్ట్ మెంట్స్ వారుకలిసి రీసెర్చ్ చేస్తారు. క్లినికల్ సిగ్నిఫికేషన్స్ పరిశీలిస్తారు. వీఆర్కే డైట్ ను కాన్సర్ బాధితులకు అడాప్ట్ చేశారు. దానిప్రభావం పేషెంట్స్ మీద స్పష్టంగా కనిపించింది.
కీమో థెరపీని ఇమ్యునైజ్ చేసి, మరింత మెరుగు పరిచే గుణం వీఆర్కే డైట్ కు ఉంది అని గుర్తించారు. రెండు, మూడు నెలల నుంచి మంచి ఫలితాలు కనిపించడం మొదలుపెట్టాయి. మామూలుగా కీమో థెరపీ చేసినప్పుడు ట్యూమర్ ఒక పార్ట్ నుంచి మరో పార్ట్ కు రెప్లికేట్ అయిన సందర్భాలు కనిపించాయి.
అయితే వీఆర్కే డైట్ తో పాటు కీమోథెరపీ ఇచ్చినప్పుడు రెప్లికేషన్స్ ఆగిపోయాయి. కాన్సర్ పేషెంట్లు కీమో థెరపీతో పాటు వీఆర్కే డైట్ ను తీసుకోవడం ద్వారా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని మా అధ్యయన కేంద్రం విస్తృత పరిశోధన అనంతరం ధ్రువీకరించింది. ఇందుకు గానూ వీరమాచనేని రామకృష్ణ కు “ఆంకో న్యూట్రీషియనిస్ట్” అవార్డుతో సత్కరించింది.
భవిష్యత్ లో చాంక్జింగ్ హైజియా కాన్సర్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ వీరమాచనేనితో కలిసి మరిన్ని పరిశోధనలు చేయటానికి మరియు ప్రపంచ వ్యాప్తంగా వీఆర్కే డైట్ ను అనేక వైద్య సమస్యలకు చక్కటి పరిష్కారం గా పరిచయం చేయటం గురించి రెండు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు.
చైనాలో పలువురు మినిష్టర్లు, డాక్టర్లు, పరిశోధకులు వీరమాచనేని ని కలిసి రానున్న కాలంలో చైనాలో వీరమాచనేనితో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించటం గురించి చర్చించారు. అక్కడ కాన్సర్ హాస్పిటల్ లో ఒక బ్లాక్ కు వీరమాచనేని పేరు పెట్టడానికి ప్రతిపాదించారు.
డైట్ విషయంలో ప్రపంచంలో నెంబర్ ఒన్ గా ఉన్న చైనా వీఆర్కే డైట్ ఇండియాను బెస్ట్ డైట్ ఫర్ కాన్సర్ అండ్ అదర్ డిసీజెస్ గా గుర్తించడం భారతదేశంకే గర్వకారణం.. అని డాక్టర్ సంపత్ తెలిపారు.